Ponnala Lakshmaiah: బీఆర్‌ఎస్‌లో చేరిన మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య

Ponnala Lakshmaiah Joins In BRS Party
x

Ponnala Lakshmaiah: బీఆర్‌ఎస్‌లో చేరిన మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య

Highlights

Ponnala Lakshmaiah: సీఎం కేసీఆర్‌ సమక్షంలో మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు.

Ponnala Lakshmaiah: సీఎం కేసీఆర్‌ సమక్షంలో మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయనకు ముఖ్యమంత్రి గులాబీ కండువాను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అలాగే జనగామకు చెందిన పలువురు నేతలు బీఆర్‌ఎస్‌ తీర్థం స్వీకరించారు. ఈ సందర్భంగా పొన్నాల మాట్లాడుతూ.. ఎన్నికల నేపథ్యంలోనే పలు రాజకీయ పార్టీలు కులగణనను తెరమీదకు తీసుకొస్తున్నాయని అన్నారు. కానీ, కేసీఆర్‌ సీఎం అయిన 3 నెలలకే కులగణన, సమగ్ర సర్వే చేపట్టారని గుర్తు చేశారు. జనగామ నియోజకవర్గంలో కేసీఆర్‌ 7 రిజర్వాయర్లు నిర్మించారని చెప్పారు. జనగామ అత్యున్నత అభివృద్ధి కోసమే బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరానన్నారు. జనగామ జిల్లాకు మరింత ప్రోత్సాహకం ఇవ్వాలని, పాడిపరిశ్రమ అభివృద్ధికి సహకరించాలని సీఎం కేసీఆర్‌ను కోరారు.

Show Full Article
Print Article
Next Story
More Stories