Ponguleti Srinivasa Reddy: పంతం నెగ్గించుకున్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Ponguleti Srinivasa Reddy Won The Assembly Election
x

Ponguleti Srinivasa Reddy: పంతం నెగ్గించుకున్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి 

Highlights

Ponguleti Srinivasa Reddy: ఖమ్మం జిల్లాలో భద్రాచలానికి మాత్రమే పరిమితమైన బీఆర్ఎస్

Ponguleti Srinivasa Reddy: పొంగులేటి పంతం నెగ్గించుకున్నారు. ఖమ్మం జిల్లాలో గులాబీ పార్టీని గెలవనివ్వనని దాదాపు 6 నెలల క్రితం పొంగులేటి చేసిన శపథం చేశారు. పొంగులేటి అన్నట్లుగానే భద్రాచలం స్థానం మినహా బీఆర్ఎస్ ఎక్కడా విజయం సాధించలేదు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పొంగులేటి ఆపరేషన్ బీఆర్ఎస్ సక్సెస్ అయినట్లే కనిపిస్తోంది. పాలేరులో పొంగులేటితో పాటు ఖమ్మంలో తుమ్మల విజయం సాధించారు. సిట్టింగ్ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డిపై పొంగులేటి విజయం సాధించగా.. మంత్రి పువ్వాడపై తుమ్మల విజయ ఢంకా మోగించారు.

తొలి రౌండ్ నుంచే ఆధిక్యం సాధించిన పొంగులేటి..2,3,4 రౌండ్లలోనూ ఆధిక్యం సంపాదించారు. 5 రౌండ్లు పూర్తయ్యసరేకి 12,600 ఓట్ల ఆధిక్యం సాధించారు. ఏడవ రౌండ్ పూర్తయ్యే సరికి 21,086 ఓట్ల మెజార్టీతో ముందంజలో నిలిచారు. చివరి రౌండ్ పూర్తయ్యే సరికి 40 వేల పైచిలుకు మెజార్టీ సాధించి విజయ దుందుభి మోగించారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అందరి దృష్టిని ఆకర్షించిన నియోజకవర్గాల్లో పాలేరు ఒకటి. ఖమ్మం జిల్లాలోని ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పోటీలో ఉండగా.. బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డికి టికెట్ కేటాయించింది. సీపీఎం అభ్యర్థిగా తమ్మినేని వీరభద్రం ఇక్కడి నుంచి బరిలో ఉన్నారు. అయితే ఇక్కడ పోటీ ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యే సాగింది.

పాలేరు నియోజకవర్గంతో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మెజార్టీ స్థానాల్లో కాంగ్రెస్ హవా నడిచిందని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు అంచనా వేశాయి. రాష్ట్రంలోనే పోలింగ్ ఎక్కువగా నమోదయ్యే నియోజకవర్గాల్లో పాలేరు నియోజకవర్గం ఒకటి. 2014లో 90.32 శాతం, 2016 ఉపఎన్నికలో 89.95 శాతం పోలింగ్ నమోదైంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 92.09 శాతం పోలింగ్ నమోదు కాగా, 2023లో 90.89 శాతం పోలింగ్ నమోదైంది. క్రితంసారితో పోలిస్తే.. ఒక శాతానికిపైగా ఇక్కడ పోలింగ్ తగ్గింది.

పాలేరు బీఆర్ఎస్ టికెట్ ఆశించి భంగపడిన తుమ్మల నాగేశ్వర రావు కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే కాంగ్రెస్ అధిష్టానం ఆయనకు ఖమ్మం టికెట్ కేటాయించింది. అంతకు ముందే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన పొంగులేటికి పాలేరు టికెట్ కేటాయించింది. వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల సైతం ఇక్కడి నుంచి పోటీ చేస్తానని గతంలో పలుమార్లు ప్రకటించారు. కానీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థన మేరకు ఆమె పోటీ చేయడం లేదని ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీకి తన మద్దతు ప్రకటించారు.

పాలేరు చరిత్రను పరిశీలిస్తే.. 1962 నుంచి 2018 వరకు పదకొండుసార్లు ఇక్కడి నుంచి కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకటరెడ్డి మరణించడంతో 2016లో పాలేరులో ఉపఎన్నిక జరిగింది. కాంగ్రెస్ తరఫున వెంకటరెడ్డి భార్య సుచరితార రెడ్డి పోటీ చేయగా.. బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన తుమ్మల నాగేశ్వర రావు బైపోల్‌లో విజయం సాధించారు. కానీ 2018 ఎన్నికల్లో తుమ్మల ఓడిపోయారు.

Show Full Article
Print Article
Next Story
More Stories