Ponguleti: రఘునాథ్‌ రాజకీయాల్లోకి వచ్చేందుకు సహకరిస్తా

Ponguleti About Raghunath Yadavs Political Entry
x

Ponguleti: రఘునాథ్‌ రాజకీయాల్లోకి వచ్చేందుకు సహకరిస్తా

Highlights

Ponguleti: రఘునాథ్‌తో కలిసి ప్రయాణం చేస్తా

Ponguleti: మాజీ ఎంపీ పొంగులేటి పొలిటికల్ హీట్ హైదరాబాద్‌ను తాకింది. బీజేవైఎం నాయకుడు రఘునాథ్ యాదవ్‌‌ నిర్వహించిన సమావేశానికి హాజరవడం హాట్ టాపిక్‌గా మారింది. కూకట్‌పల్లిలోని అల్విన్ కాలనీలో రఘునాథ్‌ యాదవ్‌ నిర్వహించిన యూత్ కెన్ లీడ్ అనే సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు పొంగులేటి. తమ్ముడు రఘునందన్‌, తాను కలిసి ప్రయాణం చేస్తామన్నారు. రాజకీయాల్లో యువత పాత్ర ముఖ్యమని.. రాష్ట్ర రాజకీయ తలరాత మార్చేందుకు యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి యూత్‌కి ఆదర్శంగా నిలిచారన్న బీజేవైఎం నేత రఘునాథ్ యాదవ్‌.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పొంగులేటి చేస్తున్న పోరాటానికి యూత్ కెన్ లీడ్ ఆర్గనైజేషన్ నుంచి మద్దతు ఇస్తామన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories