Nagarjuna Sagar: నాగార్జునసాగర్ ఉపఎన్నికతో వేడెక్కిన రాజకీయాలు

Politics Heated up With the Nagarjunasagar by Election
x

Nagarjuna Sagar:(File Image)

Highlights

Nagarjuna Sagar: నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో గెలిచేందుకు అన్ని పార్టీలవారు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి.

Nagarjuna Sagar: నాగార్జున సాగర్ ఉప ఎన్నికతో రాజకీయాలు వేడెక్కాయి. ఈ స్థానాన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. తమ ఉనికిని చాటుకునేందుకు కాంగ్రెస్ కష్టపడుతోంది. మరో సిట్టింగ్ స్థానాన్ని చేయి జారకుండా ఉండేందుకు అధికార టీఆర్ఎస్ పార్టీ గట్టిగానే ప్రయత్నిస్తోంది. మరోవైపు.. తమ ఖాతాలో మరో ఎమ్మెల్యే స్థానాన్ని వేసుకోవడం కోసం బీజేపీ వ్యూహాలకు పదును పెట్టింది. దీంతో.. రాజకీయం మరింత హీట్ పెరిగింది.

హాలియా మండలం అనుముల గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రచారానికి వెళ్లిన టీఆర్ఎస్ అభ్యర్థి భగత్‌ను స్థానికులు అడ్డుకున్నారు. దీంతో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. టీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. కాంగ్రెస్ శ్రేణులపై దాడికి నిరసనగా జానారెడ్డి తనయుడు జయవీర్ బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.. అయితే.. ఇరు వర్గాలను అదుపు చేసేందుకు పోలీసులు లాఠీ చార్జ్ చేశారు..

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులపై కార్యకర్తలు రాళ్ల దాడి చేశారు.. ఈ దాడిలో కానిస్టేబుల్‌ తలకు గాయమైంది. విషయం తెలుసుకున్న ఎస్పీ రంగనాథ్ సంఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితిని తెలుసుకున్నారు. అనుములలో పోలీసులు భారీగా మోహరించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories