అమర జవాన్‌కు నివాళి

అమర జవాన్‌కు నివాళి
x
Highlights

జమ్ముకశ్మీర్‌లోని కుప్వారా జిల్లా మాచిల్ సెక్టార్ వద్ద చొరబాటుదారులకు, భద్రత బలగాలకు జరిగిన కాల్పుల్లో తెలంగాణ జవాన్ ర్యాడా మహేష్ వీరమరణం పొందారు....

జమ్ముకశ్మీర్‌లోని కుప్వారా జిల్లా మాచిల్ సెక్టార్ వద్ద చొరబాటుదారులకు, భద్రత బలగాలకు జరిగిన కాల్పుల్లో తెలంగాణ జవాన్ ర్యాడా మహేష్ వీరమరణం పొందారు. ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకొని అమరుడైన ర్యాడా మహేష్‌కు ఎమ్మెల్సీ కవిత నివాళులర్పించారు. వీరోచిత పోరాటంలో.. దేశం కోసం తన ప్రాణాలను వదులుకున్న... వీర జవాన్‌ కుటుంబానికి తెలంగాణ జాతి అండగా ఉంటుందని ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చేశారు.

ఆర్మీ జవాన్‌ మహేష్ వీర మరణం పట్ల మంత్రి ప్రశాంత్ రెడ్డి ఘన నివాళి అర్పించారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మహేష్ త్యాగం మరువలేనిదని అన్నారు. రాష్ట్ర ప్ర‌భుత్వం త‌ర‌ఫున సీఎం కేసీఆర్, వేల్పూర్ వాసిగా తాను మ‌హేశ్ కుటుంబానికి అండ‌గా ఉంటాన‌ని ప్ర‌క‌టించారు. మహేష్‌తో పాటు వీర మరణం పొందిన సైనికులకు జోహార్లు పలికారు.

ఉగ్ర‌దాడిలో వీర‌మ‌ర‌ణం పొందిన రాడ్యా మ‌‌హేశ్‌కు ఐటీ మంత్రి కేటీఆర్ ఘ‌న నివాళుల‌ర్పించారు. మ‌హేశ్ త్యాగం మ‌రువ‌లేనిది అని పేర్కొన్నారు. మ‌హేశ్ కుటుంబానికి అన్ని విధాలా అండ‌గా ఉంటామ‌ని కేటీఆర్ భ‌రోసానిచ్చారు.

రాడ్యా మ‌హేశ్ మృతిపై డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డి ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించారు. మమ్మల్ని సురక్షితంగా ఉంచినందుకు ధన్యవాదాలు అన్నారు. మీ వీరత్వం ఎప్పటికీ మరచిపోలేమ‌ని డీజీపీ పేర్కొన్నారు.

ర్యాడా మహేష్ మృతి ప‌ట్ల‌ రాష్ట్ర శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి నివాళుల‌ర్పించారు. ఈ సంద‌ర్భంగా స్పీక‌ర్ స్పందిస్తూ.. దేశ రక్షణ కోసం సైన్యంలో చేరి భారతావని కోసం మ‌హేష్‌ చేసిన త్యాగం మరువలేనిదన్నారు. దేశ రక్షణ కోసం ప్రాణాలు అర్పించిన వీర సైనికుడు మహేష్ కు యావత్తు తెలంగాణ నివాళి అర్పిస్తుందన్నారు. మహేష్‌తో పాటు వీరమరణం పొందిన తోటి సైనికులకు జోహార్లు తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు స్పీక‌ర్‌ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. వీర జవాన్ల పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు.



Show Full Article
Print Article
Next Story
More Stories