Ramoji Rao: రామోజీరావు మృతిపై రాజకీయ, సినీ ప్రముఖుల సంతాపం
Ramoji Rao: రామోజీరావు మృతిపట్ల రాజకీయ, సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.
Ramoji Rao: రామోజీరావు మృతిపట్ల రాజకీయ, సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. ప్రధాని మోదీ, చంద్రబాబు, సీఎం రేవంత్, వెంకయ్యనాయుడు, కిషన్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్, పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, సంతాపం తెలిపారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న రామోజీరావు ఇవాళ ఉదయం ఆస్పత్రిలో కన్నుమూసిన సంగతి తెలిసిందే.
The passing away of Shri Ramoji Rao Garu is extremely saddening. He was a visionary who revolutionized Indian media. His rich contributions have left an indelible mark on journalism and the world of films. Through his noteworthy efforts, he set new standards for innovation and… pic.twitter.com/siC7aSHUxK
— Narendra Modi (@narendramodi) June 8, 2024
రామోజీ రావు కుటుంబానికి ప్రధాని తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్ (ట్విటర్)లో పోస్ట్ చేశారు. రామోజీరావు మీడియాను విప్లవాత్మకంగా మార్చిన దార్శనికుడు. పాత్రికేయ, సినీ రంగంపై చెరగని ముద్రవేశారు. మీడియాలో సరికొత్త ప్రమాణాలు నెలకొల్పారు. ఆయన ఎప్పుడూ దేశాభివృద్ధి కోసమే ఆలోచించేవారు అని మోదీ తన పోస్టులో పేర్కొన్నారు.
Deeply saddened by the demise of Padma Vibhushan Shri Ch. Ramoji Rao the founder & Chairman of the Eenadu group. Shri Ramoji Rao was more than an institution-builder; he was an institution in himself.
— M Venkaiah Naidu (@MVenkaiahNaidu) June 8, 2024
Through Eenadu, the most widely circulated Telugu newspaper, Shri Ramoji… pic.twitter.com/owFrRnOw93
మీడియా దిగ్గజం రామోజీరావుకు మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు సంతాపం తెలిపారు ‘రామోజీ రావు వ్యక్తి కాదు, శక్తివంతమైన వ్యవస్థ. వ్యక్తిగా మొదలై వ్యవస్థగా ఎదిగిన వారి జీవితం నుంచి యువతరం నేర్చుకోవాల్సిన పాఠాలు ఎన్నో ఉన్నాయి. తెలుగు వారందరికీ రామోజీరావు గర్వకారణం’ అని వెంకయ్య నాయుడు Xలో పోస్ట్ చేశారు.
ఈనాడు గ్రూపు సంస్థల చైర్మన్ శ్రీ రామోజీరావు అస్తమయం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ఒక సామాన్య కుటుంబంలో పుట్టి అసామాన్య విజయాలు సాధించిన శ్రీ రామోజీరావు మరణం తీవ్ర ఆవేదనకు గురి చేసింది. అక్షర యోధుడుగా శ్రీ రామోజీ తెలుగు రాష్ట్రాలకు, దేశానికి ఎన్నో సేవలు అందించారు. తెలుగు వారి… pic.twitter.com/jYHQDFJdxF
— N Chandrababu Naidu (@ncbn) June 8, 2024
రామోజీ మరణం తనను తీవ్ర ఆవేదనకు గురిచేసిందన్నారు చంద్రబాబు. తిరిగి కోలుకుంటారని అనుకున్నా కానీ..ఇంతలోనే ఇలాంటి వార్త వినాల్సి వస్తుందనుకోలేదన్నారు. రామోజీ మరణం రాష్ట్రానికే కాదు దేశానికి తీరని లోటన్నారు.
ఈనాడు అధినేత, ప్రముఖ పారిశ్రామికవేత్త, పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత చెరుకూరి రామోజీరావు గారి మరణం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది.
— Revanth Reddy (@revanth_anumula) June 8, 2024
తెలుగు జర్నలిజానికి విశ్వసనీయత, తెలుగు పారిశ్రామిక రంగానికి విలువలు జోడించిన ఘనత ఆయనకే దక్కుతుంది.
తెలుగు పత్రికా, మీడియా రంగానికి రామోజీరావు గారు… pic.twitter.com/QEfjfOuN2E
రామోజీరావు మృతి పట్ల సీఎం రేవంత్‌రెడ్డి సంతాపం తెలిపారు. రామోజీరావు అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఏర్పాట్లు పర్యవేక్షించాల్సిందిగా రంగారెడ్డి కలెక్టర్, సైబరాబాద్ కమిషనర్ కు సీఎస్ ద్వారా ఆదేశాలు జారీ చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
రామోజీ రావు మృతిపట్ల బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం తెలిపారు. పలు రంగాల్లో వ్యాపారవేత్తగా, మీడియా సంస్థల వ్యవస్థాపకుడిగా ఆయన అందించిన సేవలను స్మరించుకున్నారు. శోకతప్తులైన రామోజీ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఎవ్వరికీ తలవంచని మేరు పర్వతం ..
— Chiranjeevi Konidela (@KChiruTweets) June 8, 2024
దివి కేగింది 🙏💔
🙏 ఓం శాంతి 🙏 pic.twitter.com/a8H8t9Tzvf
ఎవ్వరికీ తలవంచని మేరు పర్వతం దివి కేగింది..ఓం శాంతి అని చిరంజీవి ట్వీట్ చేశారు.
శ్రీ రామోజీ రావు గారు లాంటి దార్శనీకులు నూటికో కోటికో ఒకరు. మీడియా సామ్రాజ్యాధినేత మరియూ భారతీయ సినిమా దిగ్గజం అయినటువంటి ఆయన లేని లోటు ఎప్పటికీ పూడ్చలేనటువంటిది. ఆయన మన మధ్యన ఇక లేరు అనే వార్త చాలా బాధాకరం.
— Jr NTR (@tarak9999) June 8, 2024
‘నిన్ను చూడాలని’ చిత్రంతో నన్ను తెలుగు సినీ పరిశ్రమకి పరిచయం… pic.twitter.com/ly5qy3nVUm
రామోజీరావు మృతికి తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు సీనీనటుడు జూనియర్ ఎన్టీయార్. రామోజీరావు వంటి దార్శనీకులు నూటికో కోటికో ఒకరు ఉంటారన్నారు. తనను నిను చూడాలని సినిమాతో చిత్ర పరిశ్రమకు రామోజీరావు పరిచయం చేశారని జూనియర్ ఎన్టీఆర్ అన్నారు. ఆమహనీయుడికి ఆత్మశాంతి చేకూరాలని కోరుకుంటున్నానని జూనియర్ ఎన్టీఆర్ అన్నారు. రామోజీరావు కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు.
ఈనాడు అధినేత, ప్రపంచంలోనే అతిపెద్ద సినీ స్టూడియో రామోజీ ఫిల్మ్ సిటీ నిర్మాత, పద్మ విభూషణ్ శ్రీ రామోజీ రావు గారి
— JanaSena Party (@JanaSenaParty) June 8, 2024
మరణ వార్త తీవ్ర బాధాకరం.
జనసేన పార్టీ తరపున ఆయనకు నివాళి అర్పిస్తూ, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము.#RamojiRao pic.twitter.com/ev2N2hQXCC
అక్షరయోధుడు రామోజీరావు తుదిశ్వాస విడిచారని తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాను. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా. ఆయన స్థాపించిన ఈనాడు పత్రిక భారతీయ పత్రికా రంగంలో పెను సంచలనమే. అక్షరానికి సామాజిక బాధ్యత ఉందని నిరూపించారు. రామోజీ ఫిల్మ్ సిటీ నిర్మాణంతో భారతీయ చిత్ర పరిశ్రమకు హైదరాబాద్ను వేదికగా చేశారు. ఆయన కుటుంబానికి నా తరఫున, జనసేన తరపున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అని అన్నారు పవన్.
దూరదృష్టి గల వ్యక్తి: మల్లికార్జున ఖర్గే
రామోజీరావు మరణం పట్ల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే విచారం వ్యక్తం చేశారు. మీడియా, సినిమా రంగంలో అనేక మార్పులకు రామోజీరావు నాందిపలికిన వ్యక్తి రామోజీరావు అని ఆయన కొనియాడారు. పాత్రికేయ రంగానికి రామోజీరావు విశేషకృషి చేసిన విషయాన్ని ఖర్గే గుర్తు చేశారు.
తెలుగు భాషకు విశేష సేవలు : దత్తాత్రేయ
రామోజీరావు మృతి పట్ల హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ సంతాపం తెలిపారు. పాత్రికేయ రంగంలో రామోజీరావు చెరగని ముద్ర వేశారన్నారు. పత్రికా రంగంలో నూతన ఒరవడి సృష్టించారని దత్తాత్రేయ గుర్తు చేశారు. తెలుగు భాషకు ఆయన చేసిన సేవలు మరువలేనివిగా దత్తాత్రేయ చెప్పారు.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire