ఆరు పెళ్లిళ్లు చేసుకొని అడ్డంగా బుక్కయిన నిత్య పెళ్ళికొడుకు..!

ఆరు పెళ్లిళ్లు చేసుకొని అడ్డంగా బుక్కయిన నిత్య పెళ్ళికొడుకు..!
x
Highlights

ప్రేమ పేరుతో యువతుల్ని మోసం చేస్తున్న వివాహితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఫేస్‌బుక్‌లో పరిచయం పెంచుకుని అమ్మాయిల్ని దగా చేస్తున్న కేటుగాడి లీలలు హైదరాబాద్‌లో బయటకొచ్చాయి

ప్రేమ పేరుతో యువతుల్ని మోసం చేస్తున్న వివాహితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఫేస్‌బుక్‌లో పరిచయం పెంచుకుని అమ్మాయిల్ని దగా చేస్తున్న కేటుగాడి లీలలు హైదరాబాద్‌లో బయటకొచ్చాయి. ప్రేమ పెళ్లి అంటూ పరిచయం పెంచుకుని.. వారిని లొంగదీసుకుని ఆ పై డబ్బులకు పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌ చందానగర్ ఆర్టీసీ కాలనీకి చెందిన విజయభాస్కర్‌ లీలలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి.

ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన కుర్ర విజయభాస్కర్‌ 2017 మేనకోడలును వివాహం చేసుకున్నాడు. పెళ్లి అయినప్పటి నుంచి భార్యను సరిగ్గా చూసుకోకుండా వేధింపులకు గురిచేసేవాడు. పెళ్లి సమయంలో 15 లక్షల కట్నం, 25 తులాల బంగారం ఇచ్చారు. అయినా.. అవి సరిపోనట్టు మరింత కట్నం కోసం వేధింపులకు గురి చేసేవాడు. అదే సమయంలో ఫేస్ బుక్‌లో అమ్మాయిలతో పరిచయం పెంచుకుని ప్రేమ, పెళ్లి అంటూ బురీడి కొట్టించాడు. అలా విజయ్ భాస్కర్ చేతిలో ఆరుగురు మోసపోయినట్టు పోలీసులు గుర్తించారు. భార్య ఫిర్యాదుతో భాస్కర్ బండారం బయటపడింది. ఎలాగైనా న్యాయం చేయాలని పోలీసులను భార్య కోరుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories