మూడేళ్ల అవంతిక మిస్సింగ్‌ కేసును ఛేదించిన పోలీసులు

మూడేళ్ల అవంతిక మిస్సింగ్‌ కేసును ఛేదించిన పోలీసులు
x
Highlights

ఈ నెల 14న సొంత ఊరికి వెళ్లేందుకు పాప కుటుంబీకులంతా ఎంజీబీఎస్‌కు వచ్చారు. బస్సు ఎక్కే సమయంలో కుటుంబ సభ్యుల మధ్య ఘర్షణ నెలకొంది.

తెలంగాణ వ్యాప్తంగా సంచలనం రేపిన మూడేళ్ల అవంతిక మిస్సింగ్‌ కేసును ఛేదించారు పోలీసులు. కేవలం 20 గంటల్లోనే కిడ్నాపర్ల చెర నుంచి బాలికను సురక్షితంగా కాపాడారు. ఈ నెల 14న సొంత ఊరికి వెళ్లేందుకు పాప కుటుంబీకులంతా ఎంజీబీఎస్‌కు వచ్చారు. బస్సు ఎక్కే సమయంలో కుటుంబ సభ్యుల మధ్య ఘర్షణ నెలకొంది. ఇక.. అదే సమయంలో అవంతిక బస్‌ దిగి.. వారి నుంచి దూరంగా ఫ్లాట్‌ఫాం మీదకు చేరుకుంది. ఇది గమనించిన కిడ్నాపర్లు అవంతికను తీసుకుని అక్కడి నుంచి పరారయ్యారు.

కొంత సమయం తర్వాత పాప కనిపించడంలేదన్న విషయాన్ని గ్రహించిన తల్లిదండ్రులు.. పోలీసులకు సమాచారమిచ్చారు. మిస్సింగ్‌ కేసు నమోదు చేసిన పోలీసులు.. 7 ప్రత్యేక బృందాలుగా ఏర్పడి.. దర్యాప్తు ప్రారంభించారు. బస్టాండ్‌లోని సీసీ కెమెరాలను పరిశీలించి.. కిడ్నాపర్లను అదుపులోకి తీసుకున్నారు. నిందితులు భార్యాభర్తలు శివుడు, పార్వతిగా గుర్తించారు. వారికి సంతానం లేకపోవడంతో పాపను ఎత్తుకెళ్లే ప్రయత్నం చేశారని హైదరాబాద్‌ సీపీ అంజనీ కుమార్‌ తెలిపారు. నిందితులపై గతంలో కూడా పలు కేసులున్నట్టు చెప్పారు.



Show Full Article
Print Article
Next Story
More Stories