అబ్దుల్లాపూర్‌మెట్ డబుల్ మర్డర్ మిస్టరీ ఛేదించిన పోలీసులు

Police Solve The Abdullapurmeet Double Murder Mystery
x

అబ్దుల్లాపూర్‌మెట్ డబుల్ మర్డర్ మిస్టరీ ఛేదించిన పోలీసులు

Highlights

*నిందితుడు మృతురాలి భర్త శ్రీనివాస్‌ రావుగా నిర్ధారణ

Hyderabad: అబ్దుల్లాపూర్‌‌మెట్ డబుల్ మర్డర్ కేసును పోలీసులు ఛేదించారు. మృతురాలి భర్త శ్రీనివాస్‌ రావునే నిందితుడని నిర్ధారణకు వచ్చారు. వివాహేతర సంబంధమే హత్యలకు దారి తీసినట్లు తెలిపారు డీసీపీ సన్ ప్రీత్ సింగ్. నిందితుడు ముందుగానే ప్లాన్ చేసుకొని హత్యకు పథకరచన చేసినట్టు పోలీసులు వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ పీఎస్ లిమిట్స్‌ కొత్తగూడెం బ్రిడ్జి వద్ద మంగళవారం రెండు డెడ్‌బాడీలు దొరికాయి. ఈ కేసులో హోండా యాక్టివా బైక్ నంబర్ ఆధారంగా మృతులు వారాసిగూడకు చెందిన యశ్వంత్‌, జ్యోతిలుగా గుర్తించారు పోలీసులు. జ్యోతి భర్త శ్రీనివాస్‌ రావును మంగళవారం రాత్రి అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో తానే ఈ హత్యలు చేసినట్లు ఒప్పుకున్నాడు.

విజయవాడకు చెందిన శ్రీనివాస్ రావు మల్కాజిగిరి జవహర్‌‌ నగర్‌‌కు చెందిన జ్యోతిని రెండో వివాహం చేసుకున్నాడు. గత కొంత కాలంగా సికింద్రాబాద్ వారాసిగూడలోని బౌద్ధనగర్‌‌‌లో నివాసం ఉంటున్నారు. అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న యశ్వంత్‌‌తో జ్యోతికి పరిచయం ఏర్పడింది. అది వివాహేతర సంబంధంగా మారింది. ఈ విషయంపై శ్రీనివాస్ రావు తన భార్య జ్యోతి,యశ్వంత్‌ను పలుమార్లు మందలించాడు. అయిన వారిలో మార్పు రాలేదు. దీంతో శ్రీనివాస్‌రావు సిటీ నుండి విజయవాడలోని సొంత ఊరికి మకాం మార్చాలని డిసైడ్ అయ్యాడు.

విజయవాడకు వెళ్ళే ముందు ఓ సారి యశ్వంత్‌‌ను కలుస్తానని శ్రీనివాస్‌‌తో చెప్పింది జ్యోతి. దీంతో జ్యోతితో పాటు యశ్వంత్‌‌ను హత్య చేసేందుకు శ్రీనివాస్‌రావు ప్లాన్ చేశాడు. తనతో పాటు సుత్తి, స్క్రూ డ్రైవర్‌‌ సిద్ధం చేసుకున్నాడు. ఆదివారం సాయంత్రం జ్యోతి, యశ్వంత్‌‌లతో కలిసి రెండు బైకులపై బయలు దేరారు. రాత్రి సుమారు 9.30 గంటల సమయంలో కొత్తగూడెం ఘటన స్థలానికి శ్రీనివాస్ రావు కూడా వచ్చాడు. ఇద్దరు కలిసి ఉన్న ప్రాంతానికి కొద్ది దూరంలో శ్రీనివాస్‌రావు ఉండగా యశ్వంత్, జ్యోతిలకు కొద్ది దూరం వెళ్లారు. ఆ తరువాత ఏకాంతంగా గడుపుతున్న ఇద్దరిపై శ్రీనివాస్ రావు దాడి చేశాడు. తనతో పాటు తెచ్చుకున్న సుత్తితో మొదట యశ్వంత్ తలపై కొట్టాడు. ఆ వెంటనే భార్యపై దాడి చేసి హత్య చేశాడని తెలిపారు డీసీపీ సన్ ప్రీత్ సింగ్.

Show Full Article
Print Article
Next Story
More Stories