MLC Kavitha: ఎమ్మెల్సీ కవితను తీహార్ జైలుకు తరలించిన అధికారులు

Police Officials Took MLC Kavitha To Tihar Jail
x

MLC Kavitha: ఎమ్మెల్సీ కవితను తీహార్ జైలుకు తరలించిన అధికారులు

Highlights

MLC Kavitha: ఏప్రిల్‌ 9 వరకు జ్యుడిషియల్‌ రిమాండ్‌

MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితను తిహార్ జైలుకు తరలించారు. 10 రోజుల ఈడీ కస్టడీ పూర్తికావడంతో రౌస్ అవెన్యూ కోర్టులో కవితను హాజరుపరిచారు. ఏప్రిల్ 9 వరకు రిమాండ్ విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. ఇక ఏప్రిల్ 1న కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ పై కోర్టు విచారణ జరపనుంది.

కవిత ఈడీ కస్టడీ ముగిసిన నేపథ్యంలో..ఆమెను కోర్టులో హాజరుపరిచారు. కుమారుడి పరీక్షల నేపథ్యంలో..మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కవిత తరపు లాయర్ కోరారు. కవితను 15 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపాలని ఈడీ తరపు న్యాయవాదులు విజ్ఞప్తి చేశారు. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. కవితకు 15 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ తీర్పునిచ్చింది. కవితను తీహార్ జైలుకు తరలించాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు కవితను జైలుకు తరలించారు.

తిహార్ జైలులో ఎమ్మెల్సీ కవితకు కొన్ని వెసులుబాట్లు కలిపించింది కోర్టు. ఇంటి భోజనంతో పాటు మెడిసిన్, స్లిప్పర్, బట్టలు, బుక్స్, పెన్స్, పేపర్లను తీసుకెళ్ల వచ్చని తెలిపింది. ఆభరణాలను సైతం ధరించేందుకు కవితకు కోర్టు అవకాశం కల్పించింది.

ఇదిలా ఉంటే... కోర్టు విచారణకు హాజరయ్యే సమయంలో.. కీలక వ్యాఖ్యలు చేశారు కవిత. ఇది మనీ లాండరింగ్ కేసు కాదని, పొలిటికల్ లాండరింగ్ కేస్ అంటూ కామెంట్స్ చేశారు. తాను అప్రూవర్ గా మారనని, కడిగిన ముత్యంలా బయటకు వస్తానని చెప్పారు కవిత.

Show Full Article
Print Article
Next Story
More Stories