BC Maha Dharna: పోరుబాట పట్టిన కవిత.. బీసీ మహాధర్నాకు పోలీసుల పర్మిషన్

BC Maha Dharna: పోరుబాట పట్టిన కవిత.. బీసీ మహాధర్నాకు పోలీసుల పర్మిషన్
x
Highlights

BC Maha Dharna: తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నేడు బీసీ మహాధర్న జరగనుంది. ఈ సభకు ముందు పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ,...

BC Maha Dharna: తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నేడు బీసీ మహాధర్న జరగనుంది. ఈ సభకు ముందు పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత హైదరాబాద్ సిపి ఆనంద్ కు ఫోన్ చేసి పర్మిషన్ కోరారు. దీంతో పోలీసులు నేడు ఇందిరాపార్క్ వద్ద బీసీ మహాసభకు పర్మిషన్ ఇచ్చింది. సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఈ మహాసభను నిర్వహిస్తున్నారు.

దీనికి బీఆర్ఎస్ పార్టీ కూడా పూర్తిగా మద్దతిస్తుందని. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో చేసిన బీసీ డిక్లరేషన్ అమలు చేయాలని కోరనున్నారు. బి సి రిజర్వేషన్ కోసం చేస్తున్న ఉద్యమానికి యువజన సంఘాలు, బీసీ నాయకులు, ఓయూ విద్యార్థులు కూడా పూర్తి మద్దతు తెలిపారు. జనాభా లెక్కల ప్రకారం 60 శాతం ఉన్న బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో సీట్లు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. నేడు జాగృతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బీసీ మహాసభకు ప్రజల సంఘాలు పూర్తి మద్దతు తెలిపాయి.

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దాలన్నింటిని అమలు చేసే వరకు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంపై పోరుబాట కొనసాగిస్తూనే వస్తుంది. దీనిలో భాగంగానే ఈ మధ్య రేవంత్ రెడ్డి సర్కార్ ఏడాది పాలన పూర్తి చేసుకొని సంబరాలు జరుపుకున్న సంగతి తెలిసిందే. అయితే ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల సంగతిని బీఆర్ఎస్ పార్టీతో పాటు తెలంగాణ జాగృతి కూడా గుర్తు చేస్తూనే వస్తుంది. ఇందులోనే భాగంగా ఎన్నికల ముందు కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ చేసింది.

దాని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ.. నేడు ఇందిరాపార్క్ దగ్గర బీసీ డిక్లరేషన్ మహాధర్నకు పిలుపునిచ్చింది తెలంగాణ జాగృతి. ప్రజాసంఘాలు కలిసి వచ్చి విద్యార్థి సంఘాలను మద్దతు కోరింది. సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా నేడు తలపెట్టిన బీసీ మహాధర్నకు గురువారం బిసి కుల సంఘాలు నాయకులు అనుమతి కోర్టు ఇవ్వని పోలీసులు.. చివరికి ఎమ్మెల్సీ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత సిపి సి.వి ఆనంద్ కు ఫోన్ చేసి అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేయడంతో పర్మిషన్ ఇచ్చారు.ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బీసీ మహాసభకు జరుగుతుందని ఎమ్మెల్సీ కవిత తెలిపారు.

కాంగ్రెస్ సర్కార్ ప్రకటించిన బీసీ డిక్లరేషన్ అమలుతో పాటు బీసీలకు స్థానిక సంస్థ ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని ప్రధాన అజెండాతో ఈ బీసీ మహాసభ నిర్వహిస్తుంది తెలంగాణ జాగృతి. కాంగ్రెస్ ప్రజల కు ఇచ్చిన హామీలన్నింటిని అమలు చేయాలని కోరుతూ అసెంబ్లీలో కూడా రైతు భరోసా నిధులు ఎప్పుడు విడుదల చేస్తారని ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడుతుంది. ఇదే అంశంపై పదేపదే నిలదీస్తోంది. కవిత కూడా బీసీ డిక్లరేషన్తో పాటు వెనుకబడిన కులాలకు అండగా ఉండేందుకు జాగృతి ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి సర్కారుపై పోరుబాటకు స్వీకారం చుట్టారు. అయితే ఈ సభ ద్వారా బీసీలకు ఎలాంటి న్యాయం జరుగుతుందో చూడాల్సిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories