Group-1 Aspirants: అశోక్‌ నగర్‌లో ఉద్రిక్తత.. అదుపులోకి బండి సంజయ్‌

Group-1 Aspirants: అశోక్‌ నగర్‌లో ఉద్రిక్తత.. అదుపులోకి బండి సంజయ్‌
x

Group-1 Aspirants: అశోక్‌ నగర్‌లో ఉద్రిక్తత.. అదుపులోకి బండి సంజయ్‌

Highlights

Bandi Sanjay: గ్రూప్-1 అభ్య‌ర్థుల ఆందోళ‌న‌లు కొన‌సాగుతూనే ఉన్నాయి. అశోక్‌న‌గ‌ర్ చౌర‌స్తాకు ఇవాళ ఉద‌యం భారీ సంఖ్య‌లో గ్రూప్-1 అభ్య‌ర్థులు చేరుకున్నారు.

Bandi Sanjay: గ్రూప్-1 అభ్య‌ర్థుల ఆందోళ‌న‌లు కొన‌సాగుతూనే ఉన్నాయి. అశోక్‌న‌గ‌ర్ చౌర‌స్తాకు ఇవాళ ఉద‌యం భారీ సంఖ్య‌లో గ్రూప్-1 అభ్య‌ర్థులు చేరుకున్నారు. గ్రూప్‌-1 అభ్యర్థుల ఆందోళనకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, ఎంపీ బండి సంజయ్‌ మద్దతు పలికారు. వారిని పరామర్శించి.. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రూప్‌-1 అభ్యర్థులతో కలిసి సెక్రటేరియట్‌కు ర్యాలీగా బయల్దేరారు. దీంతో ఆ ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు.

ఈ సందర్భంగా పోలీసుల తీరుపై బండి సంజయ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎంను కలిసి వాస్తవాలు వివరించేందుకు వెళ్తున్నామని చెప్పారు. సచివాలయానికి వెళ్లి తీరుతామని స్పష్టం చేశారు. దీంతో పోలీసులు బండి సంజయ్‌ను అదుపులోకి తీసుకున్నారు.

29 జీవోను రద్దు చేయాలని కేంద్రమంత్రి బండి సంజయ్‌ డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మానవత్వంతో ఆలోచించాలన్నారు. రిజర్వేషన్ల వ్యవస్థను రద్దు చేయదలుచుకున్నారా అని ప్రశ్నించారు. 29 జీవో ఎందుకు తీసుకొచ్చారని అన్నారు. ప్రభుత్వం మొండిపట్టు వీడాలని చెప్పారు. రేవంత్‌ పాలన నిజాంను తలపిస్తోందని తెలిపారు. అభర్థులపై లాఠీచార్జ్‌ సరికాదన్నారు. కోర్టును కూడా ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తోందన్నారు బండి సంజయ్.

Show Full Article
Print Article
Next Story
More Stories