Charlapalli Railway Station: చర్లపల్లి రైల్వే స్టేషన్ ప్రారంభించిన ప్రధాని మోదీ.. కొత్త టర్మినల్‌తో ఎవరికి బెనిఫిట్ అంటే...

Charlapalli Railway Station: చర్లపల్లి రైల్వే స్టేషన్ ప్రారంభించిన ప్రధాని మోదీ.. కొత్త టర్మినల్‌తో ఎవరికి బెనిఫిట్ అంటే...
x
Highlights

Charlapalli Railway Station: చర్లపల్లి రైల్వే స్టేషన్ ప్రారంభించిన ప్రధాని మోదీ.. చర్లపల్లి కొత్త టర్మినల్‌తో ఎవరికి బెనిఫిట్ అంటే...

PM Modi inaugurates Charlapalli New Terminal Station in Telangana: చర్లపల్లి రైల్వే స్టేషన్‌ను ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్‌గా ప్రారంభించారు. రూ. 413 కోట్ల నిధులు వెచ్చించి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, సరికొత్త హంగులతో ఈ రైల్వే స్టేషన్‌ను నిర్మించారు. చర్లపల్లి రైల్వే స్టేషన్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావడంతో హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లోని సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్లపై పడుతున్న భారాన్ని తగ్గించుకునేందుకు రైల్వే శాఖకు అవకాశం ఏర్పడింది.

ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం, గతేడాది డిసెంబర్ 28నే చర్లపల్లి రైల్వే స్టేషన్ ప్రారంభం కావాల్సి ఉంది. అయితే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణంతో ఆ కార్యక్రమం వాయిదా పడింది. నేడు వర్చువల్ పద్ధతిలో జరిగిన ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి కూడా పాల్గొన్నారు.

చర్లపల్లి కొత్త రైల్వే స్టేషన్ రాకతో ఎవరికి ఎక్కువ బెనిఫిట్?

హైదరాబాద్ అర్బన్ ఏరియాలో ఈశాన్య ప్రాంతం ఎక్కువగా మేడ్చల్ జిల్లా పరిధిలోకి వస్తుంది. ఈ ప్రాంతం నుండి దూర ప్రాంతాలకు రాకపోకలు సాగించే రైలు ప్రయాణికులు సికింద్రాబాద్ వరకు వెళ్లాల్సి వస్తోంది. కొన్నిసార్లు తమ ప్రాంతం నుండే రైలు వెళ్తున్నప్పటికీ రైలు ఎక్కాలన్నా, దిగాలన్నా సికింద్రాబాద్ వరకు వెళ్లక తప్పని పరిస్థితి. ఈశాన్య భాగంలో నగరానికి ఆనుకుని ఉన్న గ్రామీణ ప్రాంతాల వారిది కూడా అదే పరిస్థితి. కానీ చర్లపల్లి రైల్వే స్టేషన్ (Charlapalli Railway station) అందుబాటులోకి రావడంతో ఈ చుట్టు పక్కల ప్రాంతాల వారు రైలు ప్రయాణం కోసం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ (Secunderabad Railway station) వరకు వెళ్లాల్సిన అవసరం లేదు. చర్లపల్లి నుండే రాకపోకలు సాగించడానికి వారికి మార్గం సుగుమమైంది. ఇది వారికి భారీగా దూరభారాన్ని కూడా తగ్గించనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories