భారత్ బయోటెక్ శాస్త్రవేత్తలకు మోడీ అభినందనలు

భారత్ బయోటెక్ శాస్త్రవేత్తలకు మోడీ అభినందనలు
x
Highlights

కరోనా వ్యాక్సిన్‌ అభివృద్ధిపై సమీక్షించేందుకు మూడు నగరాల పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ హైదరాబాద్‌ వచ్చారు. జినోమ్‌వ్యాలీలో గల భారత్‌ బయోటెక్‌ను...

కరోనా వ్యాక్సిన్‌ అభివృద్ధిపై సమీక్షించేందుకు మూడు నగరాల పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ హైదరాబాద్‌ వచ్చారు. జినోమ్‌వ్యాలీలో గల భారత్‌ బయోటెక్‌ను సందర్శించి 'కొవాగ్జిన్‌' టీకా అభివృద్ధిపై శాస్త్రవేత్తలతో చర్చించారు. కాగా కొవాగ్జిన్‌ టీకాపై ప్రస్తుతం మూడో దశ క్లినికల్‌ ప్రయోగాలు జరుగుతున్నాయి. ఇక కొవాగ్జిన్‌ ప్రస్తుత పరిస్థితిపై భారత్‌ బయోటెక్‌ యాజమాన్యం, శాస్త్రవేత్తలు ప్రధానికి వివరించారు.

వ్యాక్సిన్‌ కోసం తీవ్రంగా కృషి చేస్తున్న భారత్‌ బయోటెక్‌ శాస్త్రవేత్తలకు అభినందనలు తెలుపుతూ మోడీ ట్వీట్‌ చేశారు. ఈ సంస్థ కోవిడ్-19 వ్యాక్సిన్ తయారీని వేగవంతం చేసేందుకు ఐసీఎంఆర్‌తో కలిసి పని చేస్తోందన్నారు. కోవిడ్-19 నిరోధానికి స్వదేశీ వ్యాక్సిన్ తయారీలో సాధించిన పురోగతిని శాస్త్రవేత్తలు తనకు వివరించారని తెలిపారు. భారత్‌ బయోటెక్‌ సందర్శన అనంతరం హకీంపేట విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని.. అక్కడి నుంచి పుణె బయల్దేరి వెళ్లారు. పుణెలో సీరం ఇన్‌స్టిట్యూట్‌ను ఆయన సందర్శించనున్నారు.



Show Full Article
Print Article
Next Story
More Stories