నాయిని అంత్యక్రియల్లో దొంగలు చేతివాటం!

నాయిని అంత్యక్రియల్లో దొంగలు చేతివాటం!
x
Highlights

మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అంత్యక్రియల్లో దొంగలు చేతివాటం చూపారు. అంత్యక్రియలకు వచ్చిన ప్రజా ప్రతినిధులు, నాయకుల పర్సులను ఓ దొంగల ముఠా కొట్టేసింది. బాధితుల్లో పలువురు ప్రముఖులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అంత్యక్రియల్లో దొంగలు చేతివాటం చూపారు. అంత్యక్రియలకు వచ్చిన ప్రజా ప్రతినిధులు, నాయకుల పర్సులను ఓ దొంగల ముఠా కొట్టేసింది. బాధితుల్లో పలువురు ప్రముఖులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఫిర్యాదుతో వెంటనే అలర్ట్ ‌అయిన పోలీసులు గ్యాంగ్‌లో ఒక సభ‌్యున్ని గుర్తించి పట్టుకున్నారు. నిందితుడి నుండి మూడువేలకుపైగా సొమ్మును రికవరీ చేశారు. పరారీలో ఉన్న దొంగల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.

అటు కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్ననాయిని జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఇటీవల కరోనా సోకడంతో బంజారాహిల్స్ లోని ఓ ఆసుపత్రిలో నాయిని నర్సింహారెడ్డి చికిత్స పొందారు. కోవిడ్ నెగటివ్ రిపోర్టు వచ్చినప్పటికీ ఊపిరితిత్తుల్లో ఇన్ ఫెక్షన్ సోకడంతో జూబ్లిహిల్స్ అపోలోకు తరలించారు. రాత్రి 12 గంటల 25 నిమిషాలకు మృతి చెందినట్లు ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి.

నాయిని నర్సింహారెడ్డి 1944 మే 12న సుభద్రమ్మ, దేవయ్య రెడ్డి దంపతులకు జన్మించారు. భార్య ఆహల్యరెడ్డి, కుమారుడు దేవందర్ రెడ్డి, కుమార్తె సమతారెడ్డి ఉన్నారు. నాయిని స్వస్థలం నల్లగొండ జిల్లా దేవరకొండ మండలం నేరేడుగొమ్మ. కార్మిక నేతగా నాయిని నర్సింహారెడ్డి గుర్తింపు పొందారు. తెలంగాణ ఉద్యమంలో మొదట్నించీ కీలక పాత్ర పోషించిన నాయిని తొలి, మలి దశ తెలంగాణ ఉద్యమాల్లో చురుకుగా పాల్గొన్నారు. పలు ప్రముఖ కంపెనీల్లో కార్మిక సంఘం నేతగా ఎన్నికయ్యారు.

Show Full Article
Print Article
Next Story
More Stories