Electric Bike: ఎలక్ట్రిక్‌ వాహనాలపై పెరుగుతున్న క్రేజ్

Petrol Price Hike, Electric Bike Sales Are Surging
x

ఎలక్ట్రిక్‌ వాహనాలపై పెరుగుతున్న క్రేజ్

Highlights

Electric Bike: డీజిల్‌, పెట్రోల్ ధరలు అదుపు తప్పాయి. పైసా పైసా పెరుగుతూ హడ్రెడ్‌ క్రాస్‌ చేశాయి.

Electric Bike: డీజిల్‌, పెట్రోల్ ధరలు అదుపు తప్పాయి. పైసా పైసా పెరుగుతూ హడ్రెడ్‌ క్రాస్‌ చేశాయి. వందరూపాయల పెట్రోల్‌ కొట్టిస్తే 10 కిలోమీటర్ల మైలేజ్‌ వచ్చే పరిస్థితి లేదు. బండి బయటకు తీయాలంటేనే వాహనదారులు లెక్కలు వేసుకోవాల్సి వస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎలక్ట్రిక్‌ వెహికిల్స్‌ అందర్నీ అట్రాక్ట్‌ చేసుకుంటున్నాయి. తింటే గ్యారలే తినాలి కొంట్టే ఎలక్ట్రిక్‌ బండే కొనలానే రోజులు వచ్చేశాయి. ఇక హైదరాబాద్‌ గ్రేటర్‌ వాసులతే ఈ ట్రాఫిక్‌ నగరంలో ఎలక్ట్రిక్‌ వెహికిలే బెటర్‌ అంటూ డిసైడ్‌ అవుతున్నారు.

పెరుగుతున్న ఇంధనం ధరలు వెంటాడుతున్న పొల్యుషన్‌కు చెక్‌ పెట్టే రోజులు వచ్చేశాయి. వాహనదారుల కష్టాలను గట్టెక్కించడానికి ఎలక్ట్రిక్‌ వెహికిల్స్ మార్కెట్లోకి దూసుకస్తున్నాయి. ఇటు ప్రభుత్వాలు కూడా ఎలక్ట్రిక్‌ వెహికిల్స్ కొనుగోళ్లను ఎంకరేజ్‌ చేస్తూ రాయితీలను ఇస్తున్నాయి. దీంతో చాలా కస్టమర్లు ఎలక్ట్రిక్‌ వెహికిల్స్‌ వైపే మొగ్గుచూపుతున్నారు. ఫోర్‌ విల్లర్స్ ఎలక్ట్రిక్‌ వెహికిల్స్ అత్యాధునిక హంగులతో అట్రాక్ట్‌ చేసుకుంటున్నాయి. ఇటు పొల్యూషన్‌, వాహనదారుల ఆరోగ్యాన్ని కూడా ఎలక్ట్రిక్‌ వాహనాలు కాపాడుతాయని షోరూం నిర్వాహకులు చెబుతున్నారు.

ఎలక్ట్రిక్‌ వాహనాల క్రేజ్‌ రోజురోజుకు పెరుగుతోంది. గ్రేటర్‌లో ఒక్క నెలరోజుల్లోనే 5వేల వరకు ఎలక్ట్రిక్‌ బైకులు అమ్ముడుపోయాయి. ఇటు కార్లు, ఆటోల కోసం కూడా ఆర్డర్లు వస్తున్నాయని ఎలక్ట్రిక్ వాహన షోరూమ్ నిర్వాహకులు చెబుతున్నారు. ఎలక్ట్రిక్‌ వెహికిల్స్ లాంగ్‌ డ్రైవ్‌కు పనిచేయవని వాహనదారులు భావిస్తున్నారు. మరోవైపు నగరంలో ఛార్జింగ్ కేంద్రాలు అందుబాటులో లేకపోవడంతో కొంతమంది వాహనదారులు ఆలోచిస్తున్నారు. ఛార్జింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తే అమ్మకాలు మరింత పెరుగుతాయని వాహనదారులు అంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories