అక్రమ డిపాజిట్ల నిరోధక చట్టంపై సుప్రీంలో పిటిషన్‌

అక్రమ డిపాజిట్ల నిరోధక చట్టంపై సుప్రీంలో పిటిషన్‌
x
Highlights

తెలంగాణ అగ్రిగోల్డ్ కస్టమర్ అండ్‌ ఏజెంట్ల సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆండాళు రమేష్ బాబు అక్రమ డిపాజిట్ల నిరోధక చట్టం 2019 అమలు కావడం లేదంటూ...

తెలంగాణ అగ్రిగోల్డ్ కస్టమర్ అండ్‌ ఏజెంట్ల సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆండాళు రమేష్ బాబు అక్రమ డిపాజిట్ల నిరోధక చట్టం 2019 అమలు కావడం లేదంటూ సుప్రీంకోర్టులో శనివారం పిటిషన్ దాఖలు చేసారు. మోసపోయిన బాధితులకు న్యాయం జరగాలని ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అగ్రిగోల్డ్ కంపెనీ 6700 కోట్ల రూపాయలను 8 రాష్ట్రాలకు చెందిన 32 లక్షల మంది కస్టమర్ల చేత డిపాజిట్ చేయించుకొని బోర్డ్ తిప్పేశారు.

ఈ సందర్భంగా రమేశ్‌బాబు మాట్లాడుతూ కోర్టులలో కేసులు నడుస్తున్నా ప్రభుత్వాలు బాధితులకు ఎలాంటి సహాయ సహకారాలు అందించకపోవడంతో వేలాది మంది ఆత్మహత్య లకు పాల్పడడం నిజంగా బాధాకరం అని తెలిపారు. వివిధ హైకోర్టుల్లో అగ్రిగోల్డ్ కేసులు 5 సంవత్సరాలుగా పెండింగులో ఉన్నాయని ఆయన అన్నారు. ఐ.ఎమ్.ఇ , సిరిగోల్డ్ , అక్షయ గోల్డ్, అభయ గోల్డ్, హీరాగోల్డ్, అగ్రిగోల్డ్, బొమ్మరిల్లు, ఎన్ మార్ట్ లాంటి 200 కంపెనీలు 50 లక్షల మంది కస్టమర్ల వద్ద వేలకోట్ల రూపాయల డిపాజిట్ లను వసూల్ చేసి మోసం చేసాయని ఆయన వాపోయారు. సెబీ ఉత్తర్వులు కూడా అమలు కావడం లేదని ఆయన అన్నారు. ఇలా మోసం చేసిన కంపెనీలపై అక్రమ డిపాజిట్ల నిరోధక చట్టం 2019 ప్రకారం కఠిన శిక్షలు అమలు చేసి బాధితులకు సత్వరమే న్యాయం చేయాలని సుప్రీంకోర్టును కోరినట్లు పిటిషనర్ రమేష్ బాబు, తెలిపారు. ఆయా ప్రభుత్వాలు సైతం ఆస్తులు అటాచ్ మెంట్ చేస్తున్నారు తప్ప బాధితులకు డబ్బుల పంపిణీ చేయడం లేదన్నారు. ఈ కేసు సుప్రీంకోర్టు లో ఈ నెల 26వ తేదీన విచారణ కు రానున్నట్లు పిటిషనర్ రమేష్ బాబు వెల్లడించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories