Petition in High Court against over Corona Treatment Fee: ప్రైవేట్ ఆస్పత్రుల్లో కరోనా ఫీజుల దోపిడీపై పిల్..

Petition in High Court against over Corona Treatment Fee: ప్రైవేట్ ఆస్పత్రుల్లో కరోనా ఫీజుల దోపిడీపై పిల్..
x
Highlights

Petition in High Court against over Corona Treatment Fee: తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరిగిపోవడాన్ని ప్రయివేటు ఆస్పత్రులు దాన్ని క్యాష్ గా మలచుకుంటున్నారు.

Petition in High Court against over Corona Treatment Fee: తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరిగిపోవడాన్ని ప్రయివేటు ఆస్పత్రులు దాన్ని క్యాష్ గా మలచుకుంటున్నారు. కరోనాతో బాధితులు వైద్యం కోసం ప్రయివేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తుంటే వారికి వందల రూపాయల మందులిచ్చి.. బిల్లు మాత్రం లక్షల్లో వేస్తున్నారు. దీంతో ఎంతో మంది పేద ప్రజలు ప్రయివేటు ఆస్పత్రుల్లో ఫీజులు చెల్లించలేక ఇబ్బందులపాలవుతున్నారు. ఇలాంటి ఘటనలు తెలంగాణలో ఎక్కువగా వెలుగుచూస్తున్నాయి. ఈ క్రమంలోనే తెలంగాణ హైకోర్టులో ప్రైవేట్ ఆస్పత్రుల్లో కరోనా చికిత్స చార్జీలపై ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. శ్రీ కిషన్ శర్మ అనే లాయర్ చట్టాలను ఉల్లంఘిస్తున్న ప్రైవేట్ ఆస్పత్రులపై చర్యలు తీసుకోవాలని పిల్ దాఖలు చేశారు. ప్రయివేటు ఆస్పత్రుల్లో కరోనా చికిత్స చార్జీల్లో పారదర్శకతపై మార్గదర్శకాలు విడుదల చేయాలని ఆయన కోరారు.

ఈ పిల్ వై విచారించిన హై కోర్టు ప్రభుత్వం కరోనా చికిత్స చార్జీలపై జీవో ఇచ్చినప్పటికీ, ఇష్టానుసారం ఫీజులు వసూలు చేయడం శోచనీయమని హైకోర్టు అభిప్రాయపడింది. ప్రభుత్వం జీవో ఉల్లంఘించిన ఆసుపత్రులపై వెంటనే చర్యలు తీసుకుందని హైకోర్టు భావిస్తుందని తెలిపింది. బిల్లు చెల్లించలేదనే కారణంతో డీఎంఓను డిశ్చార్జ్ చేయని ఆస్పత్రిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని స్పష్టం చేసింది. ఒకవేళ చర్యలు తీసుకోకపోతే ఎందుకు తీసుకోలేదో తెలపాలంటూ ప్రభుత్వానికి తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. అధిక ధరల వసూలు చేసిన నాలుగు ప్రైవేట్ ఆస్పత్రులకు కూడా తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేయాలని తెలిపింది. ఈ నెల 14లోగా వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి, కేంద్ర, రాష్ట్ర క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్‌ కౌన్సిల్‌ను హైకోర్టు ఆదేశించింది.

తెలంగాణ ప్రభుత్వం కరోనా పరీక్షకు ప్రైవేట్ ల్యాబ్స్‌లో గరిష్టంగా రూ.2200 వసూలు చేయాలని ధరలను ఖరారు చేసిన విషయం తెలిసిందే. వెంటిలేటర్ లేకుండా ఐసీయూ ఛార్జి రోజుకు రూ.7500, ఐసోలేషన్ ఛార్జి రోజుకు రూ.4000, వెంటిలేటర్‌తో ఐసీయూలో ఛార్జి రోజుకు రూ.9000గా ఖరారు చేశారు. అంతే కాక యాంటీ వైరల్ మందులు వాడితే ఛార్జి అదనంగా ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన రేట్లతో తాము చికిత్స ఇవ్వలేమని ప్రైవేట్ ఆస్పత్రులు చెప్పినప్పటికీ అదే రేట్లకు ట్రీట్‌మెంట్ ఇవ్వాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఐనప్పటికీ పలు ఆస్పత్రులు ధనార్జనే ధ్యేయంగా లక్షల్లో ఫీజులు వసూలుచేస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories