Hyderabad: పెంపుడు పిల్లి మిస్సింగ్‌... ఆచూకీ తెలిపితే రూ.30వేలు

Pet Cat Missing Huge Reward for Those who Find it out in Hyderabad
x

పెంపుడు పిల్లి మిస్సింగ్ (ఫైల్ ఇమేజ్)

Highlights

Hyderabad: పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన పెంపుడు పిల్లి యజమాని

Hyderabad: కొందరికి కన్నపిల్లలు.. పెంపుడు జంతువులు రెండు సమానమే. ప్రేమను పంచడంలో ఎక్కడ తేడా చూపించరు. మూగజీవాలను కూడా అల్లారుముద్దుగా చూసుకుంటారు. వాటికేమైన అయితే అల్లాడిపోతారు. హైదరాబాద్‌ టోలిచౌకికి చెందిన సెరీనా కూడా ఓ పిల్లిపై అంతటి ప్రేమను పెంచుకున్నారు. ఆ బుల్లి పిల్లికి జింజర్‌ అని నామాకరణం చేసి అప్యాయతను పంచారు. ఇప్పడది సడన్‌గా మిస్‌ అయ్యింది. దానిని పట్టించిన వారికి 30 వేల బహుమతి ఇస్తానంటూ యజమాని ప్రకటించారు.

జూన్ 17న రాయదుర్గంలోని ఓ పెట్‌ క్లినిక్‌లో పిల్లికి ఫ్యామిలీ ప్లానింగ్‌ ఆపరేషన్ చేయించారు. పిల్లి కాస్త నిరసంగా ఉండడంతో జూన్ 23న మళ్లీ క్లినిక్‌లో అడ్మిట్‌ చేయించారు. ఇక మరుసటి రోజు పిల్లి మిస్సింగ్‌ అంటూ ఆస్పత్రి వర్గాలు సెరీనాకు సమాచారం అందించాయి. ఆ వార్త విన్న సెరీనా ఆందోళనకు గురయ్యారు. వెంటనే పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు.

ఆ పిల్లికి ఇప్పుడు ట్రీట్‌మెంట్‌ అత్యవసరమని ఇప్పుడది ఎలా ఉందోనని సెరెనీ టెన్షన్‌ పడుతున్నారు. తన పిల్లి ఆచూకీ తెలిసిన వారికి 30 వేల బహుమతి ఇస్తానంటూ ప్రకటించారు. ఈ వ్యవహారంపై రాయదుర్గం పోలీసులు కూడా స్పందించారు. పిల్లి ఆచూకీ తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని చెబుతున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories