యూట్యూబ్‌లో నేర్చుకున్నారు..నకిలీ యాప్ తో దోచేశారు!

Fake Paytm App Transaction issue In Hyderabad
x

Fake Paytm App

Highlights

మోసం చేయడానికి కూడా క్లాసులు ఉంటాయి అంటూ సినిమాల్లో చూపిస్తే కామెడీగా కొట్టి పారేస్తాం. సమస్తం ఆన్ లైన్ మయం గా మారిపోయిన ప్రస్తుత పరిస్తుతుల్లో ఆ...

మోసం చేయడానికి కూడా క్లాసులు ఉంటాయి అంటూ సినిమాల్లో చూపిస్తే కామెడీగా కొట్టి పారేస్తాం. సమస్తం ఆన్ లైన్ మయం గా మారిపోయిన ప్రస్తుత పరిస్తుతుల్లో ఆ సినిమా సంఘటనలు నిజంగానే కనిపిస్తుంటే ఔరా! అనిపిస్తోంది. ఇంతకీ ఏం జరిగిందంటే.. దర్జాగా ఓ దుకాణంలోకి వెళ్లి వేలాది రూపాయాల బిల్లు చేసి.. ఫోన్ లోని నకిలీ యాప్ ద్వారా చెల్లింపు చేసినట్టు నటించి చక్కా పారిపోయారు కొందరు. దుకాణం యజమాని పోలీసులను ఆశ్రయిస్తే.. దర్యాప్తు చేసిన పోలీసులకు విస్మయం కలిగించే విషయాలు బయటపడ్డాయి. హైదరబాద్ లో జరిగిన ఓ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి..

టెక్నాలజీ పెరుగుతున్నకొద్దీ ఆన్లైన్ పేమెంట్ విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీన్ని ఛాన్స్ గా తీసుకుని కొందరు కేటుగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. ఫోన్ పే నుండి గూగుల్ పే వరకు వచ్చిన నకిలీ మాయాజాలం ఇప్పుడు పేటీఎం వరకు పాకింది. పేటీఎం లో ఎలా నకిలీ యాప్ ని క్రియేట్ చేసి కేటుగాళ్లు మోసానికి ఎలా పాల్పడుతున్నారోచూడండి.

పేటీఎం యాప్ పరిచయం అవసరం లేని పేరు. గతంలో కేవైసీ ఉంటేనే లావాదేవీలు జరిగేవి. ఇప్పుడు కేవైసీ లేకుండానే ఈజీగా లావాదేవీలు జరుగుతున్నాయి. దీన్ని అదునుగా చేసుకుని కొందరు కేటుగాళ్ళు పేటీఎం నకిలీ యాప్ ని క్రియేట్ చేసి సొమ్ము కాజేస్తున్నారు.

హైదరాబాద్ లో చోటుచేసుకున్న ఓ ఘటన నకిలీ యాప్ ల బాగోతం బయట పెట్టింది. పాతబస్తీలోని ఓ బట్టల దుకాణానికి వెళ్లిన ముఠా సభ్యులు 28 వేల రూపాయల విలువైన వస్త్రాలు కొనుగోలు చేశారు. పేటీఎం ద్వారా బిల్లు చెల్లిస్తామంటూ షాప్ యాజమానితో సెల్ నంబర్ తీసుకున్నారు. ట్రాన్సాక్షన్ జరిగే సమయానికి అప్పటికే కేటుగాళ్ల వద్ద ఉన్న PAY ANY TIME spoof యాప్ ద్వారాడబ్బు చెల్లించినట్లు గ్రీన్ కలర్ టిక్ మార్క్ చూపించింది. తన ఖాతాలోకి డబ్బు వచ్చింది అనుకుని షాపు ఓనర్ వారిని పంపించేశాడు. ఖాతాలో చూస్తే డబ్బు జమ కాకపోవటంతో అనుమానం వచ్చిన షాప్ యాజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు నకిలీ యాప్ గుట్టురట్టు చేశారు.

ఫేక్ యాప్ లను పెట్టి మోసాలకు పాల్పడుతున్న మూడు ముఠాలను హైదరాబాద్ సౌత్ జోన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరంతా యూట్యూబ్లో పేటీఎమ్ ద్వారా ఎలా మోసాలకు పాల్పడే వచ్చు అని వీడియోలు చూస్తూ ఇలాంటి నేరాలకు పాల్పడుతున్నట్లు విచారణలో తేలింది. నిందితుల నుంచి దీనికి సంబంధించిన వస్తు సామాగ్రి ని స్వాధీనం చేసుకున్నారు. నకిలీ యాప్ లతో మోసాలకు పాల్పడుతున్న ముఠాలతో వ్యాపారులు తస్మాత్ జాగ్రత్త అని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories