నిజామాబాద్‌లో రోడ్డెక్కిన అన్నదాతలు

నిజామాబాద్‌లో రోడ్డెక్కిన అన్నదాతలు
x

నిజామాబాద్‌లో రోడ్డెక్కిన అన్నదాతలు

Highlights

ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్లుగా మారింది శనగ రైతుల పరిస్ధితి. ఆరుగాలం శ్రమించి పండించిన పంటను అమ్ముకునేందుకు అన్నదాతలు నానా అగచాట్లు పడుతున్నారు....

ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్లుగా మారింది శనగ రైతుల పరిస్ధితి. ఆరుగాలం శ్రమించి పండించిన పంటను అమ్ముకునేందుకు అన్నదాతలు నానా అగచాట్లు పడుతున్నారు. కోనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని రోడ్డెక్కుతున్నారు. పండించిన పంట ఎక్కడ అమ్ముకోవాలో తెలియక ఆందోళన బాట పడుతున్నారు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వేరు శనగ రైతులు.

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వేరు శనగ పంట సాగు చేసిన రైతులు పంట చేతికొచ్చినా కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ముందుకు రాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. పంట చేతికొచ్చి నెల కావస్తున్నా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు నెలకొల్పకపోవడంతో రైతులకు నిరాశే మిగిలింది. తాము పండించిన పంట కొనుగోలు చేయాలని రైతన్నలు రోడ్డెక్కుతున్నారు.

నిజామాబాద్ జిల్లాలోని మంజీరా పరివహాక ప్రాంతంలో పెద్దఎత్తున రైతులు వేరు శనగ పంటను సాగు చేశారు. కేంద్ర ప్రభుత్వం శనగపంటకు 5100 మద్దతు ధర ప్రకటించింది. గతంలో పంట కొనుగోలు చేసినప్పటికీ అనేక నిబంధనలు పెట్టింది. రైతు నుంచి ఎకరానికి 5 క్వింటాళ్లు చోప్పున 20 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఫలితంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గతంలో ఒక్కో సోసైటీ రెండు విడతల్లో 8 వేల క్వింటాళ్లు కొనుగోలు చేసేందుకు అనుమతి ఉంది. ఈ సంవత్సరం మాత్రం శనగ పంట కొనుగోళ్లపై ఎలాంటి నిర్ణయం లేక రైతులు రోడ్డెక్కుతున్నారు.

శనన రైతుల పరిస్దితిపై సర్కారు స్పందించాల్సిన అవసరం ఉంది. లేని పక్షంలో రైతుల ఉద్యమం మరింత ఉదృతంగా సాగే అవకాశం ఉంది. ఆ దిశగా సర్కారు నిర్ణయం తీసుకుంటుందని ఆశిద్దాం.

Show Full Article
Print Article
Next Story
More Stories