Uttam Kumar Reddy Arrested: ఉద్రిక్త‌త‌గా ఛలో మల్లారం.. ఉత్త‌మ్ స‌హా ప‌లువురు నేత‌ల అరెస్టు

Uttam Kumar Reddy Arrested: ఉద్రిక్త‌త‌గా ఛలో మల్లారం.. ఉత్త‌మ్ స‌హా ప‌లువురు నేత‌ల అరెస్టు
x
uttam kumar
Highlights

Uttam Kumar Reddy Arrested: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్లారం గ్రామానికి చెందిన దళిత యువకుడిని కొట్టి చంప‌డాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ చలో మల్లారం యాత్ర చేపట్టింది

Uttam Kumar Reddy Arrested: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్లారం గ్రామానికి చెందిన దళిత యువకుడిని కొట్టి చంప‌డాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ చలో మల్లారం యాత్ర చేపట్టింది. ఈ కార్యక్రమానికి ముంద‌స్తు అనుమతలు లేవని, ఈ కార్య‌క్ర‌మానికి వెళ్తున్నతెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇత‌ర కాంగ్రెస్ నేతలను ఎక్కడికక్కడే అరెస్ట్ చేశారు. వివ‌రాల్లోకెళ్తే.. మల్లారం గ్రామానికి చెందిన దళితుడు రెవెల్లి రాజబాబును కొట్టి చంపడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఛలో మల్లారం కార్యక్రామనికి పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ నాయకులు కూడా చలో మల్లారం కార్యక్రామం చేపట్టారు. ఇరు పార్టీలు కూడా ఆదివారం రోజునే ఈ కార్యక్రమానికి పిలునివ్వడంతో పోలీసులు ముందస్తు చర్యలకు చేప‌ట్టారు.

ఈ సంద‌ర్భంలోనే మల్లారం వెళ్తున్నతెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. జనగామ మీదుగా చలో మల్లారం సభకు వెళ్తున్న ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఆదివారం పెంబర్తిలో జనగామ పోలీసులు అరెస్ట్ చేశారు. అతనిని ఘనపురం పోలీస్ స్టేషన్ కు తరలించారు. అలాగే సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను రఘునాథపురం పోలీస్ స్టేషన్ కు తరలించారు. పెద్దపల్లి జిల్లాలో మాజీ మంత్రి శ్రీధర్ బాబును పోలీసులు అరెస్టు చేశారు. శ్రీధర్ బాబు తన ఇంటి నుండి క్యాంప్ ఆపీసుకు వెళ్లేందుకు బయలుదేరగానే పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. అలాగే, రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్, టీఆర్ఎస్ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. ఇదిలా ఉంటే టీఆర్ఎస్ నేతలు కూడ చలో మల్లారం వెళ్లేందుకు ప్రయత్నించారు.వారిని కూడా పోలీసులు అడ్డుకొన్నారు. దళితులు, గిరిజనులకు ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చలేదని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఎస్సీ,ఎస్టీలకు టీఆర్ఎస్ ప్రభుత్వం న్యాయం చేయడం లేదని ఆయన విమర్శించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories