గ్రేటర్ ఎన్నికలపై ఫోకస్ పెట్టిన కాంగ్రెస్..

గ్రేటర్ ఎన్నికలపై ఫోకస్ పెట్టిన కాంగ్రెస్..
x
Highlights

గ్రేటర్ హైదరాబాద్‌ ఎన్నికలపై ఫోకస్ టీ- కాంగ్రెస్ ఫోకస్ చేసింది. బల్దియా పరిధిలోకి వచ్చే హైదరాబాద్‌, సికింద్రాబాద్, మల్కాజిగిరి, చేవెళ్ల, మెదక్ పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్‌లను టీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నియమించారు

గ్రేటర్ హైదరాబాద్‌ ఎన్నికలపై ఫోకస్ టీ- కాంగ్రెస్ ఫోకస్ చేసింది. బల్దియా పరిధిలోకి వచ్చే హైదరాబాద్‌, సికింద్రాబాద్, మల్కాజిగిరి, చేవెళ్ల, మెదక్ పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్‌లను టీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నియమించారు. మూడు పార్లమెంట్‌లకు ఐదుగురు చొప్పున.. రెండు పార్లమెంట్‌లకు ఆరుగురు సభ్యులను కాంగ్రెస్ ప్రకటించింది. హైదరాబాద్‌ పార్లమెంట్‌కు షబ్బీర్ అలీ.. సికింద్రాబాద్‌కు భట్టి విక్రమార్క.. చేవెళ్లకు పొన్నం ప్రభాకర్.. మల్కాజ్‌గిరి జీవన్ రెడ్డి.. మెదక్ కుసుమ కుమార్.. 19న కాంగ్రెస్ తరుపున అభ్యర్థులకు బీ ఫామ్ అందించనున్నారు. 21న కాంగ్రెస్ జీహెచ్ఎంసీ మేనిఫెస్టో విడుదల చేయనున్నారు.

అటు GHMC ఎన్నికల షెడ్యుల్ రానే వచ్చింది. డిసెంబర్ 01 న పోలింగ్ జరగనుండగా, 04 న కౌంటింగ్ జరగనుంది. అవసరమైన చోట డిసెంబర్ 03 న రీపోలింగ్ నిర్వహించనున్నారు. ఉదయం ఏడూ గంటల నుంచి సాయింత్రం ఆరు గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఈ విషయాన్నీ ఎన్నికల కమిషినర్ పార్థసారథి మీడియా సమావేశంలో వెల్లడించారు. ఇక ఈ ఎన్నికలను బ్యాలెట్ పద్దతిలోనే జరగనున్నట్టుగా పార్థసారథి వెల్లడించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories