Mahesh Kumar Goud: గ్రూప్-1పై సాయంత్రంలోగా నిర్ణయం.. కేటీఆర్‌కు టీపీసీసీ చీఫ్ సవాల్..

PCC Chief Mahesh Kumar Goud Challenge to KTR
x

Mahesh Kumar Goud: గ్రూప్-1పై సాయంత్రంలోగా నిర్ణయం.. కేటీఆర్‌కు టీపీసీసీ చీఫ్ సవాల్..

Highlights

పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందో శ్వేతపత్రం విడుదల చేయాలంటూ కేటీఆర్‌కు సవాల్ విసిరారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్.

Mahesh Kumar: పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందో శ్వేతపత్రం విడుదల చేయాలంటూ కేటీఆర్‌కు సవాల్ విసిరారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. గాంధీభవన్‌లో గ్రూప్-1 అభ్యర్థులతో గురువారం సమావేశమైన అనంతరం ఆయన మాట్లాడారు. కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి ఉంది కాబట్టే అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలల్లోనే 50 వేల ఉద్యోగాలిచ్చినట్లు చెప్పారు. రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల కుప్పగా చేసి తమ నెత్తిన పెట్టి పోయాడంటూ విమర్శించారు. ఆర్థిక ఇబ్బందులున్నప్పటికీ ఎన్నికల హామీలను నెరవేరస్తున్నట్లు చెప్పారు.

జీవో నెంబర్ 55ను కొనసాగిస్తూనే జీవో నెంబర్ 29ని సవరించాలని మహేష్‌కుమార్‌ గౌడ్‌ను కోరారు గ్రూప్-1 అభ్యర్థులు. ఈ విషయాలను తాను సీఎం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. నిరుద్యోగులకు ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత తీసుకుంటానని ఆయన చెప్పారు. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలో ఇవాళ సాయంత్రం లోపుగా ప్రభుత్వం నుండి నిర్ణయం వచ్చే అవకాశం ఉందని ఆయన వారికి హామీ ఇచ్చారు.

ఈ పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ నిరుద్యోగులు ఆందోళనకు దిగారు. ఈ ఆందోళన నేపథ్యంలో ఈ అభ్యర్ధుల సమస్యలు తెలుసుకోవాలని జగ్గారెడ్డి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ను ఫోన్ లో కోరారు. ఈ పరీక్షలు వాయిదా వేయాలని కోరుతున్న బృందంలోని నలుగురు సభ్యులు గాంధీభవన్ లో మహేష్ కుమార్ గౌడ్ తో సమావేశమయ్యారు. మరో వైపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో కూడా ఈ బృందం సభ్యులు సమావేశమయ్యారు. వారికి అండగా ఉంటామని కేటీఆర్ హామీ ఇచ్చారు.


Show Full Article
Print Article
Next Story
More Stories