బియ్యంతో అయోధ్య రామ మందిర నమూనా

Pattern of Ayodhya Ram Temple with Rice
x

బియ్యంతో అయోధ్య రామ మందిర నమూనా

Highlights

Ayodhya Ram Temple: వరల్డ్ రికార్డ్ సాధించిన రూపకర్త దయాకర్

Ayodhya Ram Temple: సుమారు 16 వేల బియ్యపు గింజలతో అయోధ్యలోని రామ మందిరం నమూనాను రూపొందించారు జగిత్యాల కు చెందిన దయాకర్. ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ భవ్య రామ మందిరంలో బలరాముని ప్రాణ ప్రతిష్ట చేసే సమయం నాటికే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి విజయవంతంగా పూర్తి చేసినట్టు దయాకర్ తెలిపారు. ఎంతో ఓపికగా ఒక్కొక్క గింజను ఒడిసిపట్టి అద్భుత నిర్మాణాన్ని రూపొందించడం అభినందనీయమని మాజీ మంత్రి నటుడు బాబు మోహన్ అన్నారు.

కేవలం రామ మందిరమే కాకుండా అతి చిన్న రామాలయంలో సీతారాముల చిత్రపటాల సైతం పొందుపరచడం మరింత ఆకట్టుకునే అంశమన్నారు. ఇంతటి ఘనత సాధించిన దయాకర్ ను తన చేతులతో సన్మానించడం ఎంతో గర్వంగా ఉందన్నారు. వరల్డ్ రికార్డులు సాధించిన దయాకర్ ను అందరూ అభినందనలతో ముంచెత్తుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories