Patnam Narender Reddy: పట్నం నరేందర్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్‌లో కీలక విషయాలు

Patnam Narender Reddy
x

Patnam Narender Reddy

Highlights

Patnam Narender Reddy: కొడంగల్ దాడి కేసులో అరెస్టైన మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి (Patnam Narender Reddy) రిమాండ్ రిపోర్ట్‌లో కీలక విషయాలు వెలుగు చూశాయి.

Patnam Narender Reddy: కొడంగల్ దాడి కేసులో అరెస్టైన మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్‌లో కీలక విషయాలు వెలుగు చూశాయి. ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చేందుకు కుట్ర పన్నారని పోలీసులు చెప్పారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఇతర బీఆర్ఎస్ ముఖ్య నాయకుల ఆదేశాలతోనే దాడి చేశారని ఆ రిపోర్టు తెలిపింది. ఈ ఘటనలో బి. సురేశ్‌కు తరచుగా ఫోన్ చేసిన విషయాన్ని నరేందర్ రెడ్డి ఒప్పుకున్నారని పోలీసులు అందులో తెలిపారు.

రెండు రోజుల క్రితం లగచర్లలో అధికారులపై గ్రామస్తులు దాడి చేశారు. ఈ ఘటన పథకం ప్రకారం జరిగిందని పోలీసులు గుర్తించారు. లగచర్లకు కలెక్టర్ ప్రతీక్ జైన్ సహా అధికారులు వెళ్లేలా చేసిన బి.సురేష్‌ను ఈ కేసులో పోలీసులు A1 గా తేల్చారు. సురేశ్‌తో మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి ఫోన్‌లో మాట్లాడారు. తమ పార్టీ కార్యకర్తతో మాట్లాడడంలో తప్పేం ఉందని ఆయన ప్రశ్నించారు.

నరేందర్ రెడ్డి అరెస్ట్‌ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు తదితరులు తీవ్రంగా ఖండించారు. నరేందర్ రెడ్డి కుటుంబసభ్యులను కేటీఆర్ పరామర్శించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories