Lagacherla Attack Case: పట్నం నరేందర్ రెడ్డికి జైల్లో 'స్పెషల్ బ్యారక్, ఇంటి భోజనం'

Lagacherla Attack Case: పట్నం నరేందర్ రెడ్డికి జైల్లో స్పెషల్ బ్యారక్, ఇంటి భోజనం
x
Highlights

Lagacherla Attack Case: లగచర్లలో అధికారులపై దాడి కేసులో మంగళవారం పలు కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ కేసులో అరెస్టయి చర్లపల్లి జైల్లో ఉన్న పట్నం...

Lagacherla Attack Case: లగచర్లలో అధికారులపై దాడి కేసులో మంగళవారం పలు కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ కేసులో అరెస్టయి చర్లపల్లి జైల్లో ఉన్న పట్నం నరేందర్ రెడ్డికి ప్రత్యేక బ్యారక్ ఇవ్వాల్సిందిగా హై కోర్టు ఆదేశించింది. అలాగే ఆయనకు ఇంటి నుండి భోజనం అనుమతించాల్సిందిగా కోర్టు స్పష్టంచేసింది. చర్లపల్లి జైలు సూపరింటెండెంట్‌కు కోర్టు ఈ ఆదేశాలు జారీచేసింది. తోటీ ఖైదీలతో కాకుండా తనకు ప్రత్యేక బ్యారక్ ఇవ్వాలని పట్నం నరేందర్ రెడ్డి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అలాగే తనకు ఇంటి నుండి భోజనం అనుమతించాలని ఆ పిటిషన్ లో పేర్కొన్నారు. పట్నం పిటిషన్ పై విచారణ చేపట్టిన అనంతరం కోర్టు ఈ ఆదేశాలు జారీచేసింది.

మరోవైపు ఇదే కేసులో కీలక నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న బోగమోని సురేశ్ ఇవాళ కొడంగల్‌లో కోర్టు ఎదుట లొంగిపోయారు. నవంబర్ 11న లగచర్లలో దాడి జరిగినప్పటి నుండి సురేశ్ పరారీలో ఉన్నారు. పట్నం నరేందర్ రెడ్డి సూచనలతోనే సురేశ్ ఈ దాడికి కుట్ర పన్నినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. పట్నం నరేందర్ రెడ్డి ఫోన్‌ని స్వాధీనం చేసుకున్నప్పుడు ఆయన ఫోన్ లో సురేశ్ తో 42 సార్లు మాట్లాడినట్లుగా కాల్ డేటా ఉందని పోలీసులు తెలిపారు. ఈ దాడిలో పట్నం పాత్ర ఉందనడానికి అదే ఆధారం అని పోలీసులు చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories