ఎమ్మెల్యే పల్లాకు హైడ్రా టెన్షన్‌.. నెక్స్ట్ టార్గెట్ అనురాగ్ యూనివర్శిటీ అంటూ ప్రచారం

Palla Rajeshwar Reddy scared of HYDRA
x

ఎమ్మెల్యే పల్లాకు హైడ్రా టెన్షన్‌.. హైడ్రా నెక్స్ట్ టార్గెట్ అనురాగ్ యూనివర్శిటీ అంటూ ప్రచారం

Highlights

నీలిమ అనురగ్ ఇన్స్టిట్యూట్‌ భవనాలు FTLలో కడుతున్నారని వస్తున్న ఆరోపణ నేపథ్యంలో జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి స్పందించారు.

HYDRA: హైడ్రా.. ఈ పేరు వింటేనే కబ్జాదారుల గుండెల్లో బుల్డోజర్లు పరిగెడుతున్నాయి. ఎప్పుడు ఏ నిర్మాణంపై బుల్డోజర్‌ అటాక్ జరుగుతుందో అన్న టెన్షన్‌ కబ్జాదారుల్లో మొదలైంది. తాజాగా ఎన్ కన్వెన్షన్‌ కూల్చివేతతో హైడ్రాపై అటెన్షన్‌ క్రియేట్ అవగా.. నెక్స్ట్ టార్గెట్ ఎవరనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారి గుండెల్లో గుబులు పుట్టించగా.. నెక్స్ట్ హైడ్రా చేపట్టే బుల్డోజర్ అటాక్ అనురాగ్ యూనివర్శిటీపైనే అంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీంతో ఎమ్మెల్యే పల్లాకు కూడా హైడ్రా టెన్షన్ పట్టుకుందనే ప్రచారం జరుగుతోంది.

మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్ మండలం వెంకటాపూర్ శివారులో నాదం, వెంకటాపురం చెరువులు ఆక్రమణకు గురవుతున్నాయి. FTL బఫర్ జోన్ ప్రాంతాల్లో అనురాగ్, నీలిమ ఇన్స్టిట్యూట్ లు అక్రమ కట్టడాలు నిర్మించారని ఇరిగేషన్ అధికారులు గుర్తించారు. దీంతో పల్లా రాజేశ్వర్ అనురాగ్ ఇన్స్టిట్యూట్‌పై FTL భూముల వివాదం రాజుకుంటుంది. ఇప్పటికే చెరువు బఫర్‌జోన్‌ను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారని బీఆర్ఎస్ నేత, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డిపై కేసు నమోదైంది. మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్ మండలం వెంకటాపూర్ రెవెన్యూ పరిధిలోని నాదం చెరువు బఫర్‌జోన్‌లో అక్రమ నిర్మాణాలు చేపట్టినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. చెరువు బఫర్‌జోన్‌లో సుమారు ఎకరన్నర భూమిని ఆక్రమించి అనురాగ్ ఇన్‌స్టిట్యూషన్‌కు సంబంధించిన అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని నీటిపారుదలశాఖ ఏఈ పరమేష్‌, పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో FTL పరిధిలో అనురాగ్ యూనివర్శిటీ భవనాలను ఆక్రమించి కడుతున్నారా? లేదా అనే అంశంపై త్వరలోనే ఇరిగేషన్, రెవిన్యూ అధికారులు హైడ్రాకు రిపోర్టు పంపనున్నారు.

మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం వెంకటాపూర్ గ్రామం సర్వే నెంబర్ 813 లోని నాడెం చెరువు బఫర్ జోన్ లో అనురాగ్ యూనివర్సిటీ, నీలిమ మెడికల్ కాలేజ్, నీలిమ ఆసుపత్రి నిర్మించారని గతంలో కూడా వివాదం కొనసాగింది. నంగారాబేరి లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు గణేష్ నాయక్ గతంలో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్, రెవెన్యూ శాఖ అధికారులకు, ఇరిగేషన్ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే అధికారులు ఎవరూ స్పందించకపోవడంతో గణేష్ నాయక్ హైకోర్టును ఆశ్రయించాడు. పూర్తి విచారణ అనంతరం హైకోర్టు ద్వారా అనురాగ్ యూనివర్సిటీ, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు వెలువడే అవకాశం ఉండటంతో అప్రమత్తమైన ఇరిగేషన్ శాఖ అధికారులు ముందస్తుగా పోచారం ఐటీ కారిడార్ పిఎస్ లో అనురాగ్ యూనివర్సిటీ, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిపై ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు పోచారం ఐటీ కారిడార్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

వెంకటాపురం గ్రామంలో మొత్తం రెండు చెరువులున్నాయి. ఒకటి నాదం చెరువు.. మరొకటి వెంకటాపురం చెరువు. ఈ రెండు చెరువులు కింద వందలాది ఎకరాలు పంటలు సాగు చేసుకునే వారు. ఇక్కడ వ్యవసాయానికి ఆధారమైన వెంకటాపురం చెరువుకు ప్రస్తుతానికి ఎలాంటి ప్రమాదం లేకున్నా.. చెరువులోకి వచ్చే ఇన్పుట్ వాటర్ రాకుండా అనురాగ్ ఇన్స్టిట్యూషన్ భారీ నిర్మాణాలు చేపడుతుందనే ఆరోపణలున్నాయి. ఈ భవనాలతో పాటు కాలేజీ ప్లే గ్రౌండ్, బాస్కెట్ బాల్ కోర్ట్ లాంటివి ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఇవన్నీ బఫర్ జోన్లోకి వస్తాయో లేదో కానీ... చెరువులోకి నీటి ప్రవాహానికి అడ్డంకులు వస్తున్నాయని గ్రామస్థులు అంటున్నారు.

ఇదిలా ఉండగా నాదం చెరువు FTLపై ప్రస్తుతం వివాదం నడుస్తుంది. నాదం చెరువు మొత్తం 60 ఎకరాలకు పైచిలుకు విస్తరించి ఉండగా.. సర్వే నెంబర్ 813 ,814,815 ,816లో FTL పరిధిలోకి వస్తుందని గత విలేజ్‌ మ్యాప్‌లో గుర్తించబడింది. అయితే ఆ ప్రాంతంలో ఇపుడు మొత్తం నీలిమ, అనురాగ్ ఇన్స్టిట్యూషన్ భవనాల నిర్మాణాలు జరుగుతున్నాయి. దీంతో నాదం చెరువును ఆక్రమించి నిర్మాణాలు కట్టారని ఇరిగేషన్ అధికారులు గుర్తించారు. ఇక్కడ ఎకరం నుండి రెండెకరాల పైచిలుకు ఆక్రమణ చేసి అనురాగ్ యూనివర్శిటీకి సంబంధించిన భవనాలు కడుతున్నారని ఇరిగేషన్ అధికారులు గ్రౌండ్ లెవెల్‌లో సర్వేలో తేల్చారు.

HMTV నాదం చెరువు ఆక్రమణలకు సంబంధించి గ్రౌండ్ లెవెల్ లో అసలు ఏం జరిగిందనే విషయాన్ని పరిశీలించేందుకు వెళ్లగా.. నాదం చెరువులో FTL ప్రాంతంలో నీలిమ ఇన్స్టిట్యూట్ సంబంధించి రెండు భవనాలను గుర్తించింది. అంతేకాకుండా నీటి నిల్వ ఉండే ప్రాంతంలో పూర్తిగా మట్టితో కప్పేసి, చెరువును పూడ్చే ప్రయత్నం చేశారు. హెచ్ఎంటీవీ బృందం చేరుకోగానే ఆ పనులు నిలిపివేశారు. పూర్తిగా చెరువు నీటిలోకి మట్టిని నింపుతూ అక్రమ కట్టడాలను నీలిమ ఇన్స్టిట్యూట్ చేస్తున్నట్టుగా తెలుస్తుండగా.. అఫీషియల్‌గా ఇరిగేషన్ అధికారులు ధ్రువీకరించాల్సి ఉంది.

నీలిమ అనురగ్ ఇన్స్టిట్యూట్‌ భవనాలు FTLలో కడుతున్నారని వస్తున్న ఆరోపణ నేపథ్యంలో జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి స్పందించారు. 25ఏళ్ల క్రితం తాము విద్యా సంస్థలు స్థాపించామని, గత 8నెలలుగా వ్యక్తి గతంగా తన మీద, తన కుటుంబంపై దాడి జరుగుతోందన్నారు. తమకు ఎన్‌వోసీ ఇచ్చిన నీటిపారుదల శాఖే.. ఇప్పుడు తనపై కేసు పెట్టిందని చెబుతున్నారు. చెరువు భూమి ఇంచు కూడా అక్రమించలేదని స్పష్టం చేశారు.

అనురాగ్ ఇన్స్టిట్యూషన్ FTL లో నిర్మించారని వస్తున్న ఆరోపణల నేపథ్యంలో పల్ల రాజేశ్వర్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. లీగల్ అంటూ వాదనలు వినిపించి, కుల్చొద్దు అంటూ స్టే కొరకు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి హౌస్ మోషన్ దాఖలు చెయ్యగా హైకోర్టు షాక్ ఇచ్చింది. పల్ల రాజేశ్వర్ రెడ్డికి చెందిన అనురాగ్ యూనివర్శిటీ అక్రమణలు ఉన్నట్లయితే వాటి తొలగింపును చట్టప్రకారం చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో హైడ్రా కమిషన్ నెక్స్ట్ స్టెప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి సంస్థలైన అనురాగ్, నీలిమ ఇన్స్టిట్యూట్‌లపై పడనుందా..! అనే ఉత్కంఠ నెలకొంది.


Show Full Article
Print Article
Next Story
More Stories