Palla Rajeshwar Reddy: ప్రజల స్పందన చూస్తుంటే బీఆర్‌ఎస్ విజయం ఖాయం

Palla Rajeshwar Reddy About BRS Win
x

Palla Rajeshwar Reddy: ప్రజల స్పందన చూస్తుంటే బీఆర్‌ఎస్ విజయం ఖాయం

Highlights

Palla Rajeshwar Reddy: పల్లా రాజేశ్వర్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిక

Palla Rajeshwar Reddy: జనగామ నియోజకవర్గం వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది. ప్రచారానికి వచ్చిన జనగామ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి కి ఊరురా ప్రజలు మంగళ హారతులతో ఘనస్వాగతం పలుకుతున్నారు. తరిగోప్పుల, నర్మెట్ట మండల కేంద్రాలతో పాటు పలు గ్రామాలలో పల్లా రాజేశ్వర్ రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. బచన్నపేట, జనగామ మండలాలకు చెందిన 300 మంది కాంగ్రెస్, బీజేపీ పార్టీల నాయకులు పల్లా రాజేశ్వర్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి పల్లా గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బీఆర్ఎస్ పార్టీ ప్రచారానికి ప్రజల నుంచి విశేష స్పందన రావడం చూస్తుంటే పార్టీ విజయం ఖాయమైనట్లు తెలుస్తుందన్నారు పల్లా. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి ఏముందని ఆయన ప్రశ్నించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories