ఉమ్మడి నల్గొండ జిల్లాలో ధాన్యం కొనుగోళ్లలో జాప్యం

Paddy Grain Purchases in Nalgonda District
x

ఉమ్మడి నల్గొండ జిల్లాలో ధాన్యం కొనుగోళ్లలో జాప్యం

Highlights

Nalgonda: 20 రోజులు దాటుతున్న కేంద్రాల్లోనే వరి ధాన్యం

Nalgonda: ధాన్యం కొనుగోళ్లు కేంద్రాల్లో జాప్యం జరుగుతోంది. కేంద్రాలు ప్రారంభమై 20 రోజులు దాటుతున్న రైతులు రాశుల వద్దే పడుగాపులు కాస్తున్నారు. సాకులు చూపుతూ రోజుల తరబడి ధాన్యం కొనకుండా దాటవేస్తున్నారు అధికారులు, ట్రేడర్లు. నింబధనలకు తూట్లు పొడుస్తూ మద్దతుకు మంగళం పాడుతున్నారు. మండే ఎండలకు తోడు అకాల వర్షాలు అన్నదాతలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. రోజులు గడుస్తున్న కొద్ది ధాన్యం కాపాడుకోవడానికి రైతులపై అదనపు భారం పడుతోంది.

ధాన్యం అమ్ముకునేందుకు ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని కొనుగోలు కేంద్రాల్లో రైతులు నానా అగచాట్లు పడుతున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు లక్ష మెట్రిక్ టన్నుల వరకు ధాన్యం మాత్రమే ధాన్యం కొనుగోలు చేశారంటే పరిస్ధితిని ఏంటో తెలిసిపోతోంది. మూడు వారాలు దాటుతున్నా ఇంకా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా కొనుగోళ్లు ఉండడంతో రైతులు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. మరోవైపు అకాల వర్షాల భయం అన్నదాతలను కలిచివేస్తోంది.

కాంటా వేసిన ధాన్యం తరలించేందుకు లారీలు సక్రమంగా రాకపోవడంతో కొన్నిచోట్ల కాంటాలు వేయడం లేదు. అందుబాటులో ఉన్న లారీలకు అనుగుణంగా కాంటాలు వేస్తున్నారు. మరోవైపు గన్నీ బ్యాగుల కొరత కేంద్రాలను వేధిస్తోంది. దీంతో చిల్లులు పడిన పాత బ్యాగులనే వినియోగిస్తున్నారు. మాయిశ్చర్ రావడం లేదంటూ నిర్వాహకులు చెబుతుండడంతో 20 రోజులైనా రైతులు రాశుల వద్దే పడిగాపులు కాస్తున్నారు. మాయిశ్చర్ వచ్చినా కాంటాలు వేయకుండా అలసత్వం ప్రదర్శిస్తున్నారని రైతులు వాపోతున్నారు. ఇక తడిసిన ధాన్యం అరబెట్టుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు అన్నదాతలు.

కొనుగోళ్లు ప్రారంభం నుంచి ధాన్యానికి మద్దతు ధర 1960 రూపాయిలు ఇస్తామని చెబుతున్నా అది ఎక్కడా అమలు కావడం లేదు. వంద మంది రైతులు కేంద్రాలకు, మార్కెట్లకు ధాన్యం తీసుకువస్తే ఒకరిద్దరికి మినహా మిగిలిన అందరికి 1500 లోపే మద్దతు ధర ఇస్తున్నారని రైతులు ఆందోళనకు దిగుతున్నారు. ఇక సన్నాల రైతులను మిల్లర్లు, ట్రైడర్లు అడ్డంగా దోచుకుంటున్నారు. పెట్టిన పెట్టుబడి కూడా రావడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మద్దతు కోసం రోజులు తరబడి వేచిచూసి ఇక లాభం లేదని వారి చెప్పిన ధరకు ధాన్యం అమ్ముకొని భారంగా వెనుదిరుగుతున్నారు రైతులు. తేమ, తాలు సాకుగా చూపుతూ ధర తగ్గిస్తున్నారంటూ రైతులు వాపోతున్నారు. మద్దతు కోసం రోడెక్కుతున్నా కనీసం పట్టించుకునే నాధుడే లేడంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories