Corona: కరోనా సోకడంతో మహిళను ఇంట్లో నుంచి గెంటేసిన ఓనర్‌

Owner Evicts the Women After She Tests Coronavirus Positive in Karimnagar
x

కరోనా వైరస్ ప్రతీకాత్మక చిత్రం

Highlights

Coronavirus: కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో దారుణం వెలుగుచూసింది.

Coronavirus: కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో దారుణం వెలుగుచూసింది. సుశీల అనే మహిళకు కరోనా సోకిందన్న కారణంతో ఇంట్లోకి రానివ్వలేదు ఇంటి ఓనర్‌. స్థానికుల సమాచారంతో ఆమెను కరీంనగర్ ప్రభుత్వాస్పత్రిలోని ఐసోలేషన్‌ వార్డుకు తరలించారు అధికారులు. అయితే.. సుశీల చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందింది. పూర్తి వివరాళ్లో వెళ్తే.

రెక్కాడితే గానీ డొక్కాడని కష్టజీవి ఆమె. కరోనా సోకడంతో ఒంటరిగా మారింది. కన్న కొడుకులు కనికరించలేదు. ఇంటి యజమాని వెళ్లిపొమ్మన్నాడు. దీంతో.. చేసేదిలేక.. తనకున్న కూరగాయల బండిపై పడుకుండిపోయింది. తనకు వైరస్‌ సోకిందన్న విషయం కన్నా.. అయిన వాళ్ల ప్రవర్తనే ఆమెను మరింతగా బాధించింది. ఈ ఘటన కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట పట్టణంలో శనివారం జరిగింది. మునిసిపల్‌ పరిధిలోని అంబేద్కర్‌ కాలనీకి చెందిన మహిళ.. తోపుడు బండిపై కూరగాయలు విక్రయిస్తూ బతుకెళ్లదీస్తోంది. ఆమెకు ఇద్దరు కుమారులు. వారికి పెళ్లిళ్లు చేయడంతో.. పట్టణంలోనే వేర్వేరు ప్రాంతాల్లో ఉంటున్నారు.

ఆమె వారం రోజలుగా దగ్గు, జలుబు, జ్వరంతో బాధ పడుతుండడంతో.. ఈనెల 8న పరీక్ష చేయించుకోగా.. కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో.. మందులు తీసుకొని ఇంటికి చేరుకోగా.. విషయం తెలుసుకున్న ఇంటి యజయాని.. ఆమెను వెళ్లిపొమ్మన్నాడు. తన పరిస్థితిని కొడుకులకు చెప్పుకున్నా.. వారు ఏమాత్రం దయ చూపలేదు. ఇక చేసేదిలేక.. ఎక్కడ ఉండాలో తెలియక.. తన కూరగాయల బండిపై పడుకుని ఉండిపోయింది. స్థానికులు ఆమె దీనస్థితిని చూసి చలించిపోయారే తప్ప.. అయినవాళ్లు పట్టించుకోలేదు. శనివారం కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు మొలుగు దిలీప్‌ ఆమె పరిస్థితిని చూసి వైద్యాధికారులకు సమాచారం అందించారు. దీంతో.. అక్కడకు చేరుకున్న వైద్య సిబ్బంది.. ఆమెను కరీంనగర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రి ఐసోలేషన్‌ సెంటర్‌కు తరలించారు.

కరోనా మనుషుల జీవితాలను మార్చేయడం ఏమో గానీ..మనుషుల్లో మానవత్వం మచ్చుకైనా కనిపించడం లేదు. కరోనా వచ్చిన వారిని పూర్తిగా అంటరాని వారీగా చూస్తున్నారు. ఇంట్లోకి కూడా రానివ్వడం లేదు. అద్దెకుంటున్న వారి పరిస్థితి మరీ దారుణం. కరోనా వచ్చిందని ఇంటి యజమానులు ఇంట్లోకి రానివ్వడం లేదు. ఇలాంటి ఘటనలు కరోనా వచ్చిన నుంచి చాలా చూశాం... లేటెస్ట్ గా కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణం అంబేడ్కర్ కాలనీలో ఓ మహిళకు కరోనా వచ్చిందని ఇంట్లోకి రానివ్వలేదు ఆ ఇంటి యజమానులు.

దాంతో ఎక్కడుండాలో తెలియక ఆ మహిళ రోజంతా పాత వ్యవసాయ మార్కెట్లో జాగారం చేసింది. అక్కడి నుంచి వ్యవసాయ అధికారులు ఆమెను పంపించేశారు. అంబేడ్కర్ చౌరస్తలో సులబ్ కాంప్లెక్స్ ముందు నిస్సహాయ స్థితిలో ఉన్న ఆ మహిళను కాంగ్రెస్ నాయకులు మొలుగు దిలీప్ గుర్తించి వైద్యాధికారులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న వైద్య సిబ్బంది ఆ మహిళను అంబులెన్సులో కరీంనగర్ ఐసోలేషన్ సెంటర్ కు తరలించారు. అయితే.. చికిత్స పొందుతూ మహిళ మృతి చెందింది.



Show Full Article
Print Article
Next Story
More Stories