MDK Tanker: నీటిలో ప్రయాణించే బీఎంపీ యుద్ధ ట్యాంకర్లను.. తయారు చేసిన మెదక్‌ ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీ

Ordnance Factory Built Floating MDK Tanker
x

MDK Tanker: నీటిలో ప్రయాణించే బీఎంపీ యుద్ధ ట్యాంకర్లను.. తయారు చేసిన మెదక్‌ ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీ

Highlights

MDK Tanker: మల్కాపూర్ పెద్ద చెరువులో..బీఎంపీ రెండు యుద్ధ ట్యాంకుల ఫ్లోటింగ్ టెస్ట్

MDK Tanker: యుద్ధరంగంలో తిరుగులేని శక్తిగా యుద్ద ట్యాంకుల నిర్మాణంలో నూతన ఆవిష్కరణలతో మెదక్‌ ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీ దూసుకెళ్తుంది. నీటిలో ప్రయాణించే బీఎంపీ యుద్ధ ట్యాంకర్లను మెదక్‌ ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీ తయారు చేసింది. క్వాలిటీ ప్రమాణాల నిర్ధారణ సందర్భంగా మల్కాపూర్ పెద్ద చెరువులో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో తయారైన బీఎంపీ రెండు యుద్ధ ట్యాంకుల ఫ్లోటింగ్ టెస్ట్ నిర్వహించారు.

యుద్ద ట్యాంకుల నిర్మాణంలో నూతన ఆవిష్కరణలతో బీఎంపీ యుద్ధ ట్యాంకులు తయారు చేస్తున్నట్లు మెదక్‌ ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీ జిఎం రత్న ప్రసాద్ తెలిపారు. రెండు యుద్ధ ట్యాంకులు విజయవంతంగా ఫ్లోటింగ్ టెస్ట్ ఎదుర్కొంటున్నట్లు జిఎం రత్న ప్రసాద్ తెలిపారు. హైయెస్ట్ క్వాలిటీ స్టాండర్డ్ తో ఈ యుద్ద ట్యాంకులను తయారు చేస్తున్నట్లు పేర్కొన్నారు. బీ.ఎం.పి యుద్ధ ట్యాంకులు 14 టన్నుల బరువుతో బ్యాలెన్సింగ్ చేసుకుంటూ 4 వేగంతో గంటకు 8 కిలోమీటర్లు నీళ్లలో ప్రయాణం చేస్తున్నట్లు తెలిపారు.

ఈ యుద్ధ ట్యాంకర్‌ నీటితో పాటు గతుకుల రోడ్లపైన, బురదనేలల్లో, కొండ ప్రాంతంలోనైనా వేగంగా ప్రయాణించగలదని తెలిపారు.పేర్కొన్నారు. శత్రువుల దాడి నుంచి, బుల్లెట్లు, గ్రానైడ్లు, బాంబులైనా తట్టుకునేలా ధృడమైన ఉక్కుతో ట్యాంకర్‌ బాడీని నిర్మించామని తెలిపారు. క్వాలిటీ ప్రమాణాలు ఆర్మీ రిక్వైర్మెంట్ ప్రకారం తయారు చేస్తున్నట్లు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories