ఉత్తర తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్.. ఈశాన్య గాలులతో పెరిగిన చలి తీవ్రత

Orange Alert For North Telangana Due To Increased Cold Intensity With Northeasterly Winds
x

ఉత్తర తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్.. ఈశాన్య గాలులతో పెరిగిన చలి తీవ్రత

Highlights

Telangana: ఉత్తర తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్

Telangana: తెలంగాణలో చలిపంజా విసురుతోంది. ఈశాన్య గాలుల ప్రభావంతో రెండ్రోజుల నుంచి చలి తీవ్రత మరింత పెరిగింది. రాబోయే మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశాలు ఉన్నాయని వాతావరణ విభాగం అధికారులు చెబుతున్నారు. ఇక ఈశాన్య గాలుల ప్రభావంతో మధ్యాహ్నం సమయంలో కూడా వాతావరణం చల్లగా ఉంటోంది. వచ్చే మూడురోజుల్లో సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీల సెల్సియస్ వరకు తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

రాష్ట్రంలో ప్రజలు చలికి గజగజ వణికిపోతున్నారు. మరికొందరు చలి నుంచి ఉపశమనం పొందేందుకు చలిమంటలు వేసుకుంటున్నారు. ఉదయం 8 గంటల తర్వాత పొగమంచు కొనసాగుతోంది. వాతావరణం ఒక్కసారిగా మారడంతో.. సీజనల్ వ్యాధులు విజృంభించే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు బయటకు వెళ్లినప్పుడు తప్పకుండా ముఖానికి మంకీ క్యాప్, మఫ్లర్ వంటివి ధరించాలని సూచిస్తున్నారు. కళాశాలలకు వెళ్లే విద్యార్థులు, పనులకు వెళ్లే కూలీలు ఇబ్బందులు పడుతున్నారు.

సాయంకాలం సమయంలో చల్లటి గాలులు వీస్తున్నాయి. జాతీయ రహదారులు, ప్రధాన రహదారుల్లో వాహన డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం పూట మంచు తెరలు కమ్ముకోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. రాత్రిళ్లు, తెల్లవారుజామున ఉన్ని దుస్తులు ధరించాలని, సరైన జాగ్రత్తలు తీసుకోకుండా బయటకు రావొద్దని హెచ్చరిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories