Musheerabad: ఈ వయస్సులో ఎన్ని కష్టాలో.. ఓ వృద్దురాలి దీన గాథ

Musheerabad: ఈ వయస్సులో ఎన్ని కష్టాలో.. ఓ వృద్దురాలి దీన గాథ
x
Highlights

డెబ్బై ఏళ్ల వయస్సులో ఓ వృద్దురాలు తన భర్త కోసం వేచి చూస్తోంది. తన భర్త ఇంటి బయట తాళం వేసి వెళ్లిపోయాడు. దీంతో ఆ వృద్దురాలు ఎనిమిది నెలలుగా ఆ ఇంట్లోనే ఉంటూ బయటికి రాకుండా బందీగా ఉంటోంది.

డెబ్బై ఏళ్ల వయస్సులో ఓ వృద్దురాలు తన భర్త కోసం వేచి చూస్తోంది. తన భర్త ఇంటి బయట తాళం వేసి వెళ్లిపోయాడు. దీంతో ఆ వృద్దురాలు ఎనిమిది నెలలుగా ఆ ఇంట్లో నుంచి బయటికి రాకుండా బందీగా ఉంటోంది. తన భర్త ఈ రోజు వస్తాడు, రేపు వస్తాడు, ఈ చెర నుంచి విడిపిస్తాడు అని ఆశతో కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తొంది. అయినా ఫలితం లేదు. దిక్కుతోచని పరిస్థితిలో ఉన్న ఆ వృద్దురాలిని ఇంటి యజమానులే అన్నీ వారై చూసుకుంటున్నారు. తినడానికి తిండిపెడుతూ తనను ఆదుకుంటున్నారు. హృదయాలను కలచి వేసే ఈ సంఘటన పూర్తి వివరాలను తెలుసుకుందాం.

హైదరాబాద్ నగరంలోని ముషీరాబాద్ నియోజకవర్గం అడిక్‌మెట్ గణేష్ నగర్ లో ఈ సంఘన చోటు చేసుకుంది. ఏడాదిన్నర క్రితం గంగాధర్, ఆయన భార్య బేబి(72)అనే వృద్ద దంపతులు గణేష్ నగర్లో ఓ ఇంట్లో అద్దెకు దిగారు. వారు గతంలో కృష్ణా జిల్లా నాగాయలంక వీఆర్వోగా పనిచేసి ఉద్యోగ విరమణ పొందానని, తమకు పిల్లలు లేరని ఇంటి యజమానికి చెప్పి ఇక్కడ నివాసం ఏర్పాటు చేసుకున్నారని తెలిపారు. అయితే ఇంట్లో అద్దెకు దిగిన నాటి నుంచి అతను ఎక్కడికి బయటికి వెళ్లినా ఆమెను ఇంట్లోనే ఉంచి బయట తాళం వేసే వారని, ఒక్కోసారి రెండుమూడు రోజులు కూడా వచ్చేవాడు కాదని తెలిపారు.

గతంలో చేసినట్టుగానే ఎనిమిది నెలల క్రితం గంగాధర్ సొంత ఊరిలో ఉన్న వ్యవసాయ భూమిని అమ్మి వస్తానని చెప్పాడని, ఇప్పటి వరకు తిరిగి రాలేదని చెబుతున్నారు. లోపల ఆహారం లేదు. కరెంటు లేదు. ఉన్న దుస్తుల్నే ఓపిక చేసుకుని ఉతుక్కొని వేసుకుంటోంది. దీంతో ఇంటి యజమానురాలు శారద అన్నీ తానై వృద్దురాలిని చూసుకుంటుంది. ఆమెతో మాట్లాడుతూ అన్నం పెట్టేదని చెపుతున్నారు. అయితే గత మూడు నెలల క్రితం అతను ఒకసారి ఫోన్ చేసి, త్వరలో వస్తానని చెప్పినట్లు ఈ ఇంటి యజమానురాలు శారద వెల్లడించారు.

ఒక్క నెల అద్దె ఇవ్వకపోతేనే ఇల్లు ఖాలీ చేయించే యజమానులు ఉన్న ఈ కాలంలో ఈ ఇంటి యజమాని శారద మాత్రం మానవత్వాన్ని చూపిస్తుంది. దీంతో ఆ ప్రాంత వాసులందరూ ఆమెను కొనియాడుతున్నారు. కాగా ఇప్పుడు ఈ విషయం అందరికీ తెలిసి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో గురువారం అధికారులు, పోలీసులు ఆ ఇంటికి చేరుకొని, తాళం పగులగొట్టి బామ్మను బయటికి తీసుకువచ్చారు. అనంతరం ఆమెను వృద్ధాశ్రమానికి తరలించారు. మొదట ఆశ్రమానికి వెల్లడానికి ఒప్పుకోని ఆమె అధికారులు నచ్చజెప్పడంతో వెల్లారని అధికారులు తెలిపారు. అయినా తన భర్త ఎప్పుడు వస్తాడో అని ఎదురు చూస్తోంది. ఇప్పటికైనా తన భర్త రవాలని ఆ వృద్దురాలి చివరి రోజుల్లో తనక అండగా ఉండాలని అందరూ కోరుకుంటున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories