Hyderabad: ఆక్సిజన్ సిలిండర్ వెంట పెట్టుకొని వచ్చి ఓటేసిన వృద్ధుడు

Old Man Patient Cast Their Vote In Hyderabad
x

Hyderabad: ఆక్సిజన్ సిలిండర్ వెంట పెట్టుకొని వచ్చి ఓటేసిన వృద్ధుడు

Highlights

Hyderabad: లివర్ సిరోసిస్‎తో మంచాన పడినా ఓటేసి వెళ్లిన శేషయ్య

Hyderabad: ఎవరో వస్తారని ఏదో ఇస్తారని, ఇంకేదో ఇవ్వాలనీ కాదు.. ఓటు హక్కు వినియోగించుకోవడం పౌరుడిగా బాధ్యత అంటున్నాడు ఓ వృద్ధుడు. హైదరాబాద్ లో చాలా మంది ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకోవడానికి బద్ధకిస్తుంటే.. వెంటిలేటర్ మీద ఉన్న ఓ సీనియర్ సిటిజన్ మాత్రం ఆక్సిజన్ సిలిండర్ ను క్యారీ చేస్తూ.. మరీ ఓటుహక్కు వినియోగించుకున్నాడు. ఓటు వేయడం అనేది ప్రజాస్వామ్యబద్ధంగా లభించిన హక్కు అని.. దాన్ని నిర్లక్ష్యం చేయరాదని... బాధ్యతాయుత ప్రభుత్వాన్ని ఎన్నుకోవడంలో బాధ్యత గల పౌరులు వాడుకోవాల్సిన అస్త్రం ఇదేనని ఆయన చాటుతున్నాడు.

హైదరాబాద్ గచ్చిబౌలిలోని GPRA క్వార్టర్స్‎లో ఉంటున్న 75 ఏళ్ల శేషయ్య.. పలు వృద్ధాప్య సమస్యలతో, ముఖ్యంగా లివర్ సిరోసిస్ తో బాధపడుతున్నాడు. ఆ మేరకు ట్రీట్‎మెంట్ కూడా తీసుకుంటున్నాడు. అయినా తన హెల్త్ కండిషన్ తో నిర్లిప్తతకు తావు ఇవ్వకుండా ముందుకొచ్చి ఓటుహక్కు వినియోగించుకున్నారు. కుటుంబ సభ్యుల సాయం తీసుకొని ఎలాగోలా పోలింగ్ బూత్ కు చేరుకొని ఓటేసి సగర్వంగా నిలబడడం ఆసక్తి రేపుతోంది. తాను 1966 నుంచి ఏ ఎన్నికలో కూడా ఓటుహక్కు మిస్ అవ్వలేదని శేషయ్య చెబుతుండడం విశేషం. శేషయ్య తీసుకున్న చొరవతో వోటింగ్ కు దూరంగా ఉన్న సిటీ ఉద్యోగులు, యూత్ వంటి అనేక సెక్షన్ల ప్రజలకు ఆదర్శంగా నిలిచాడని పలువురు అభినందిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories