HYDRAA: మూసీ వెంట మార్కింగ్ ను అడ్డుకున్న బాధితులు: చైతన్యపురిలో ధర్నాకు దిగిన ఈటల

HYDRAA: మూసీ వెంట మార్కింగ్  ను అడ్డుకున్న బాధితులు: చైతన్యపురిలో ధర్నాకు దిగిన ఈటల
x
Highlights

HYDRAA: మూసీ వెంట ఉన్న ప్రాంతాల్లో అధికారుల సర్వేను స్థానికులు అడ్డుకుంటున్నారు.

HYDRAA: మూసీ వెంట ఉన్న ప్రాంతాల్లో అధికారుల సర్వేను స్థానికులు అడ్డుకుంటున్నారు. శుక్రవారం హైద్రాబాద్ నగరంలోని కొత్తపేట, చైతన్యపురి ప్రాంతాల్లోని మూసీ వెంట ఉన్న నిర్మించిన ఇళ్లను మార్కింగ్ చేసేందుకు అధికారులు రావడంతో స్థానికులు వారిని వెళ్లగొట్టారు. చైతన్యపురిలో ఓ బాధితుడు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి యత్నించారు. స్థానికులు ఆయనను అడ్డుకున్నారు.

మూసీని ఆక్రమించి నిర్మించిన ఇళ్లను ఖాళీ చేయించి నగరంలోని డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను బాధితులకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఉన్నపళంగా ఇళ్లను కూల్చివేస్తాం.. ఖాళీ చేయాలని అంటే ఎలా అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. బాధితులకు మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ మద్దతు పలికారు. చైతన్యపురిలో బాధితులతో కలిసి ఆయన ధర్నాకు దిగారు.

Show Full Article
Print Article
Next Story
More Stories