Heavy Rains: శ్రీరాం సాగర్‌కు పోటెత్తిన వరద.. 8 గేట్లు ఎత్తి గోదావరిలోకి నీటి విడుదల

Officials Lifted 8 Gates Of Sriram Sagar Project
x

Heavy Rains: శ్రీరాంసాగర్‌కు పోటెత్తిన వరద.. 8 గేట్లు ఎత్తి గోదావరిలోకి నీటి విడుదల

Highlights

నిజామాబాద్ జిల్లా శ్రీరాంసాగర్ సాగర్ ప్రాజక్ట్‌కి వరద పోటెత్తింది. దీంతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు అధికారులు సూపరిండెంట్ ఇంజనీర్ శ్రీనివాస్ రావు గుప్తా, ఈఈ చక్రపాణి ప్రాజెక్టు వరద గేట్లను ఎత్తి గోదావరిలోకి నీటిని విడుదల చేశారు.

Sriram Sagar Project: తెలంగాణలో రెండు రోజులుగా ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. బంగాళా‌ఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు ఉప్పొంగి ప్రవహిస్తుండగా.. పలు చోట్ల రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రాష్ట్రంలోని నీటి ప్రాజెక్టులు నిండు కుండలా మారి జలకళ సంతరించుకున్నాయి.

నిజామాబాద్ జిల్లా శ్రీరాంసాగర్ సాగర్ ప్రాజక్ట్‌కి వరద పోటెత్తింది. దీంతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు అధికారులు సూపరిండెంట్ ఇంజనీర్ శ్రీనివాస్ రావు గుప్తా, ఈఈ చక్రపాణి ప్రాజెక్టు వరద గేట్లను ఎత్తి గోదావరిలోకి నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టుపై పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ ఈ మాట్లాడుతూ 8గేట్లను ఎత్తి 25 వేల క్యూసెక్కులను గోదావరిలోకి వదిలమన్నారు. గోదావరి నదిలోకి రైతులు, చేపలు పట్టే వారు, పశువుల కాపారులు ఎవరు వెళ్లోద్దని ఆదేశాలు జారీచేశారు. ప్రాజెక్టు అధికారులు రెవిన్యూ, పోలీస్, పంచాయతీ శాఖలను అప్రమత్తం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories