వ‌ర్షాల కార‌ణంగా ఇవాళ‌, రేపు సెల‌వులు

వ‌ర్షాల కార‌ణంగా ఇవాళ‌, రేపు సెల‌వులు
x
Highlights

తెలంగాణ రాష్ట్రంలో గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. దీంతో రాష్ట్రం పూర్తిగా త‌డిసి ముద్దైంది. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం...

తెలంగాణ రాష్ట్రంలో గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. దీంతో రాష్ట్రం పూర్తిగా త‌డిసి ముద్దైంది. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ‌, రేపు సెల‌వులు ప్ర‌క‌టించింది. పిల్ల‌లు, వృద్ధులు జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని ప్రభుత్వం ప్రజలకు సూచించింది. అత్య‌వ‌స‌ర‌మైతే తప్పించి ప్ర‌జ‌లు ఎరకు కూడా బ‌య‌ట‌కు రావొద్దని ప్ర‌భుత్వం సూచించింది. నగరంలో ఉండే పాత భ‌వ‌నాల‌ను ప్రజలు వెంటనే ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాల‌కు వెళ్లాల‌ని తెలిపింది. వరదల సమయంలో అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర వ్యాప్తంగా క‌లెక్ట‌ర్ల‌ను, పోలీసు శాఖ‌ను ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్తం చేసింది.

ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నడూ లేని విధంగా వర్షాలు, వరదలు బీభత్సం సృష్టిస్తుండడంతో సీఎం కేసీఆర్ హుటాహుటిన రంగంలోకి దిగారు. రాజధాని హైదరాబాద్‌లో గత రెండు దశాబ్దాల్లో ఎన్నడూ లేనివిధంగా వర్షపాతం నమోదైనట్టు తెలుసుకొన్న సీఎం కేసీఆర్ ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ తో పాటు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ యంత్రాంగాన్ని అన్నివిధాలా సన్నద్ధంచేసి తక్షణ సహాయచర్యలు చేపట్టాల్సిందిగా ఆదేశించారు. నగరంలో వరదల దృష్ట్యా జిహెచ్ఎంసి ప్రాంతంలో ప్రభుత్వం రెండు రోజుల పాటు సెలవులను ప్రకటించారు. ఈ రోజు, రేపు అంటే 2020 అక్టోబర్ 14, 15 తేదీలలో నగరంలోని అన్ని ప్రైవేట్ సంస్థలతో సహా అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులు ప్రకటించారు. అంతే కాక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను అప్రమత్తంచేశారు.

ఇక సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ అప్పటికప్పుడే అన్ని జిల్లాల కలెక్టర్లతో వర్షాల పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు. సీఎం ఆదేశానుసారం డీజీపీ అన్ని జిల్లాల ఎస్పీలతో మాట్లాడారు. డీజీపీ ఎం మహేందర్‌రెడ్డితోనూ సీఎం మాట్లాడారు. ముంపు, లోతట్టు ప్రాంతాల్లో రక్షణ చర్యలు చేపట్టాల్సిందిగా ఆదేశించారు. ముంపు ప్రాంతాల ప్రజలకు సహాయకార్యక్రమాలపై తక్షణ చర్యలకు ఆదేశించారు. ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షితస్థానాలకు తరలించాలని నిర్దేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో సీఎండీ ప్రభాకర్‌రావు అర్ధరాత్రి 12 గంటల సమయంలో హుటాహుటిన విద్యుత్‌ సౌధకు చేరుకొని గ్రిడ్‌ సమస్య తలెత్తకుండా రక్షణ చర్యలు చేపట్టారు. రాష్ట్రంలో విద్యుత్‌ పరిస్థితిపై విద్యుత్‌ సంస్థల సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావుతో సీఎం కేసీఆర్‌ సమీక్షించారు. విద్యుత్‌ సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories