Telangana Assembly Polls: రేపే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల

Notification For Assembly Elections In Telangana Will Be Released Tomorrow
x

Telangana Assembly Polls: రేపే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల

Highlights

Telangana Assembly Polls: రేపటి నుండే అభ్యర్థి ఖర్చును లెక్కించనున్న ఈసీ

Telangana Assembly Polls: రేపు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేయనుంది. రేపు 11గంటల నుంచి రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్లు స్వీకరించనుంది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. ఈనెల 10న నామినేషన్లకు స్వీకరణ గడువు ముగియనుంది. నవంబర్ 13న నామినేషన్ల పరిశీలించనుంది. ఈనెల 15న నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధించింది. నవంబర్ 30న ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 3న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి.

ఎన్నికల్లో పోటీ చేసే జనరల్, బీసీ అభ్యర్థులకు 10 వేలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5వేలు డిపాజిట్ చేయాల్సింది ఈసీ తెలిపింది. ఆర్వో కార్యాలయాల వద్ద పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఆర్వో కార్యాలయం వద్ద ర్యాలీలు, సభలను ఈసీ నిషేధం విధించింది. నామినేషన్ వేసే వ్యక్తితో పాటు మరో ఐదుగురికి మాత్రమే అనుమతి ఇచ్చింది. రేపటి నుంచి అభ్యర్థి ఖర్చును ఈసీ లెక్కించనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories