ప్రమాదాలకు దూరంగా ఉండండి : అన్నమనేని గోపాల్ రావు

ప్రమాదాలకు దూరంగా ఉండండి : అన్నమనేని గోపాల్ రావు
x
Highlights

తెలంగాణ రాష్ట్రంలో మరో రెండు మూడు రోజుల వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపిన విషయం తెలిసిందే. అయితే భారీ వర్షాల...

తెలంగాణ రాష్ట్రంలో మరో రెండు మూడు రోజుల వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపిన విషయం తెలిసిందే. అయితే భారీ వర్షాల కారణంగా విద్యత్ అంతరాయం కలిగినట్లయితే దానికి సంబంధించిన ఫిర్యాదుల కోసం నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ సీఎండీ అన్నమనేని గోపాల్ రావు ఆధ్వర్యంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ సరఫరా లో అంతరాయం కలిగితే స్థానిక ఫ్యూజ్ ఆఫ్ కాల్ ఆఫీస్ తో పాటు విద్యుత్ శాఖ ప్రత్యేక కంట్రోల్ రూమ్ నకు నెంబర్ 9440811244/ 9440811245/ 1912/ 18004250028 ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని ఆయన తెలిపారు.

భారీ వర్షాలకు, ఈదురుగాలులకు రోడ్లపై, భవనాలపై తెగి పడ్డ కరెంటు తీగల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. ఎక్కడైనా విద్యుత్ తీగలు పడి ఉంటే వాటిని తాకకుండా వెంటనే విద్యుత్ శాఖ వారికి తెలియజేయాలని ఆయన కోరారు. ప్రజలు విద్యుత్ స్తంభాలు, విద్యుత్ తీగల, ట్రాన్స్ ఫార్మర్ లు, సర్వీస్ వైర్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వాటిని తాకకుండా దూరంగా నడవాలని ఆయన అన్నారు. వోల్టేజ్ లో హెచ్చు తగ్గులు వున్నా, ట్రాన్స్ ఫార్మర్ ల వద్ద శబ్దం వస్తున్నా వెంటనే విద్యుత్ శాఖ వారికి తెలియజేయాలని సూచించారు సీఎండీ అన్నమనేని గోపాల్ రావు. జిల్లాల సూపెరింటెండింగ్ ఇంజినీర్లు, డివిషనల్ ఇంజినీర్లు క్షేత్ర సిబ్బందితో ఎప్పటికపుడు సంప్రదిస్తూ విద్యుత్ సరఫరా పరిస్థితిని పర్యవేక్షించాలని అధికారులకు ఆదేశించారు. వర్షం నీరు నిల్వ వున్న చోట విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ ఫార్మర్లు, తీగల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎక్కడైనా రోడ్లపై, భవనాలపై తీగలు తెగిపడి ఉంటే వెంటనే సంస్థ కు తెలియజేయగలరని తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories