Hyderabad: ఇవాళ్టి నుంచి గాంధీ ఆస్పత్రిలో నాన్‌ కోవిడ్‌ సేవలు

Non Covid Services Started in Gandhi Hospital From Today
x

గాంధీ హాస్పిటల్ (ఫైల్ ఇమేజ్)

Highlights

Hyderabad: గ్రీన్‌ జోన్‌, రెడ్‌ జోన్‌గా విభజించి సేవలు * ఔట్‌ పేషెంట్‌ భవనం రెండో అంతస్తులోని కరోనా రోగులు..

Hyderabad: ఇవాళ్టి నుంచి హైదరాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో నాన్‌ కోవిడ్‌ సేవలు అందించనున్నారు. హాస్పిటల్‌ను గ్రీన్‌ జోన్‌, రెండ్‌ జోన్‌లుగా విభజించి, ఔట్‌ పేషెంట్‌ భవనం రెండో అంతస్తులో ఉన్న కరోనా రోగులను 3, 4 ఫ్లోర్‌లకు తరలించారు. మిగతా అంతస్తుల్లోని సర్జరీ విభాగాలు, ఆపరేషన్‌ థియేటర్లను పూర్తిగా నాన్‌ కొవిడ్‌ రోగులకు కేటాయించారు. అత్యవసర పరిస్థితుల్లో వచ్చేవారికి వెంటనే పరీక్షల కోసం ఒక వార్డును సిద్ధంగా ఉంచారు. అత్యవసర విభాగాల్లో నలుగురు లేదా ఐదుగురు ప్రొఫెసర్లు, నర్సులు, సిబ్బంది అందుబాటులో ఉంటారు. ఓపీ వార్డులో ప్రత్యేకంగా ఆర్‌ఎంవో ఇన్‌చార్జిగా ఉంటూ పల్మనాలజీ, మెడిసిన్‌ విభాగం వైద్యులు 24గంటల పాటు వైద్యమందించనున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories