Telanagana Assembly Elections 2023: తెలంగాణలో ముగిసిన నామినేషన్ల పర్వం

Nominations Over In Telangana Assembly Elections
x

Telanagana Assembly Elections 2023: తెలంగాణలో ముగిసిన నామినేషన్ల పర్వం

Highlights

Telanagana Assembly Elections 2023: 13న నామినేషన్ల పరిశీలన, 15న ఉపసంహరణ ఈనెల 30న పోలింగ్, వచ్చే నెల 3న కౌంటింగ్

Telanagana Assembly Elections 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగిసింది. 13న నామినేషన్ల స్కృటీని, 15న నామినేషన్ల ఉపసంహరణకు చివరి గడువు. అయితే ఈనెల 30న పోలింగ్, వచ్చే నెల 3న కౌంటింగ్ నిర్వహించనున్నారు. నిన్న ఒక్క రోజే 1,133 నామినేషన్లు దాఖలు అయ్యాయి. నిన్నటి వరకు మొత్తం నామినేషన్లు 2028 వచ్చినట్లు అధికారులు తెలిపారు. చివరి రోజు భారీగా నామినేషన్లు దాఖలు చేశారు అభ్యర్థులు. 3 గంటలలోపు ఆర్వో కార్యాలయంలో ఉన్న వారికి నామినేషన్ దాఖలు చేసేందుకు అనుమతి ఇచ్చారు. ఆర్వో కార్యాలయానికి ఎక్కువ మంది అభ్యర్థులు ఒకేసారి నామినేషన్ వేయడానికి వస్తే టోకెన్ పద్ధతిన అనుమతి ఇచ్చారు. నామినేషన్ దాఖలు చేసిన సమయం నుండి అభ్యర్థి ఖర్చును లెక్కించనున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో 67 మంది పరిశీలకులను సీఈసీ నియమించింది. ఎప్పటికప్పుడు నివేదికను సీఈవో, సీఈసీకి నేవేదిస్తున్నారు ఎన్నికల అధికారులు.

Show Full Article
Print Article
Next Story
More Stories