Telangana: కోటి డోసుల గ్లోబల్ టెండర్లకు స్పందన కరువు

No Responce for TS Global Tenders on Vaccines
x

Global Tenders on Vaccines:(File Image)

Highlights

Telangana: కోటి డోసుల కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం గ్లోబల్ టెండర్లకు దరఖాస్తులు ఆహ్వానించగా ఒక్క సంస్థ కూడా పాల్గొనలేదు

Telangana: కోవిడ్ టీకా గ్లోబల్ టెండర్లలో నిరాశే ఎదురైంది. కోటి డోసుల కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం గ్లోబల్ టెండర్లకు దరఖాస్తులు ఆహ్వానించగా..జూన్ 4వ తేదీకి గడువు ముగిసే సమయానికి ఒక్క సంస్థ కూడా టెండర్లలో పాల్గొనలేదు. కరోనా వ్యాక్సిన్ కోసం గ్లోబల్ టెండర్లను ఆహ్వానించాల‌ని మే21న తెలంగాణ‌ ప్రభుత్వం నిర్ణ‌యం తీసుకున్న విష‌యం తెలిసిందే. ఈ మేర‌కు గ్లోబల్ టెండర్లను ఆహ్వానిస్తూ ప్ర‌భుత్వం ఈ రోజు షార్ట్ టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది.

ఈ టెండర్ల ద్వారా మొత్తం 10 మిలియన్ డోసుల వ్యాక్సిన్ల‌ను కొనుగోలు చేయ‌డానికి ప్రభుత్వం సిద్ధ‌మైంది. ఆస్ట్రాజెనికా, స్పుత్నిక్ టీకా సంస్థల నుంచి టెండర్లు వస్తాయని ఆరోగ్యశాఖ ఆశించగా.... వీరికి రెండు డోసుల టీకాలు అందించడానికి వృథాతో కలిపి సుమారు 4 కోట్ల డోసులు అవసరం అవుతాయి.ఇందులో ముందుగా కోటి టీకాలను గ్లోబల్ టెండర్ల ద్వారా కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

అంతర్జాతీయ సంస్థలు టెండర్లలో పాల్గొనడం ద్వారా టీకాల లభ్యత అవకాశాలు పెరుగుతాయని, తద్వారా రాష్ట్రంలో లబ్ధిదారులకు వేగంగా టీకాలు అందించవచ్చని భావించింది. కానీ టెండర్లలో ఒక్క సంస్థా పాల్గొనకపోవడంతో... అర్హులైన లబ్ధిదారులకు సత్వరం టీకాలు అందజేయడం ప్రశ్నార్థకంగా మరింది. ప్రస్తుతానికి దేశీయ ఉత్పత్తిదారులైన భారత్ బయోటెక్ నుంచి 10 లక్షల డోసులు, సీరం సంస్థ నుంచి 7 లక్షలు డోసులు కొనుగోలు చేయనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories