Telangana: పసుపుబోర్డు పెట్టే ప్రతిపాదన లేదు

No Proposal For Turmeric Board in Telangana Central Clarified
x

సెంట్రల్ మినిస్టర్ నరేంద్ర సింగ్ తోమర్ (ఫైల్ ఫోటో)

Highlights

Telangana: రాజ్యసలో స్పష్టం చేసిన కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్రసింగ్ తోమర్

Telangana: తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటు చేసే ప్రతిపాదన లేదని కేంద్రం స్పష్టం చేసింది. టీఆర్ఎస్ ఎంపీ కేఆర్. సురేష్ రెడ్డి రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు కేంద్రం వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ లిఖితపుర్వకంగా సమాధానం ఇచ్చారు. సుగంధ ద్రవ్యాల ఎగుమతుల ప్రచారానికి కేంద్ర వాణిజ్య శాఖ స్పైసెస్ బోర్డు రీజినల్ కార్యాలయాన్ని నిజామాబాద్ లో ఏర్పాటు చేసిందని కేంద్ర మంత్రి గుర్తుచేశారు. పసుపుతో పాటు ఇతర సుగంధ ద్రవ్యాల ఎగుమతి ప్రచారం కోసం వరంగల్, హైదరాబాదజ్, నిజామాబాద్, ఖమ్మం నగరాల్లో బోర్డు కార్యాలయాలు ఉన్నాయని వెల్లడించారు.

గత పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఎంపీగా గెలిస్తే.. నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటు చేయిస్తామని ధర్మపురి అర్వింద్ రైతులకు హామీ ఇచ్చారు. ఎప్పటి నుంచో పసుపు బోర్డు ఏర్పాటుపై రైతులు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై తెలంగాణలో ఎన్నికల నాటినుంచి వివాదం నెలకొని ఉంది. తాజాగా పసుపు బోర్డుపై కేంద్రం చేసిన ప్రకటనతో మళ్లీ తెలంగాణ ప్రజల ఆకాంక్షలపై నీళ్లుచల్లినట్లయింది. దేశంలోనే అత్యధికంగా తెలంగాణ రాష్ర్టంలో పసుపు ఉత్పత్తి అవుతోంది. 2019-20 సంవత్సరంలో తెలంగాణలో 3.86 లక్షల టన్నుల పసుపు ఉత్పత్తి అయ్యింది.

తెలంగాణ ప్రజల ఆకాంక్షను కేంద్ర ప్రభుత్వం మరోసారి నీరుగార్చింది. తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటుపై సోమవారం కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. తెలంగాణలో పసుపుబోర్డు ఏర్పాటు చేసే ప్రతిపాదన ఏదీ లేదంటూ కేంద్రం పార్లమెంటులో స్పష్టం చేసింది. పసుపు, ఇతర సుంగధ ద్రవ్యాల ఎగుమతికి వరంగల్, హైదరాబాద్, నిజామాబాద్, ఖమ్మంలో బోర్డు కార్యాలయాలు ఉన్నాయని వెల్లడించింది.

ఈ మేరకు రాజ్యసభలో కేఆర్‌ సురేష్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్‌ లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. పసుపు, ఇతర సుంగధ ద్రవ్యాల ఎగుమతికి ప్రాంతీయ బోర్డు కార్యాలయం ఉన్నందున పసుపు బోర్డు పెట్టే ఆలోచన ఏదీలేదని ఆయన ప్రకటించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories