ఓ వైపు కరోనా.. మరోవైపు పోలీసుల ఆంక్షలు

ఓ వైపు కరోనా.. మరోవైపు పోలీసుల ఆంక్షలు
x
Highlights

ఓ వైపు కరోనా.. మరోవైపు పోలీసుల ఆంక్షలు ! మనసులో సంబరం ఉందేమో సందడి మాత్రం కనిపించడం లేదెక్కడ ! ఈ ఇయర్ జీవితాలతో జనాలతో ట్వంటీ ట్వంటీ ఆడేసుకుంది....

ఓ వైపు కరోనా.. మరోవైపు పోలీసుల ఆంక్షలు ! మనసులో సంబరం ఉందేమో సందడి మాత్రం కనిపించడం లేదెక్కడ ! ఈ ఇయర్ జీవితాలతో జనాలతో ట్వంటీ ట్వంటీ ఆడేసుకుంది. వ్యాక్సిన్ వస్తుంది.. ఇక తప్పాయ్ దేవుడా కష్టాలు అనుకుంటున్న సమయంలో కొత్త స్ట్రెయిన్ కంగారు పెట్టిస్తోంది. దీంతో పోలీసులు కఠిన చర్యలకు సిద్ధమయ్యారు. భారీగా మోహరించారు రోడ్ల మీద ! సంబరాలేవో ఇంటికే పరిమితం చేసుకోండి సందడి చేద్దాం అన్న పేరుతో రోడ్డెక్కారో అన్నట్లుగా కాస్త కఠినంగా ఉన్నారు ఖాకీలు.

కొన్ని ప్రాంతాల్లో మాత్రం న్యూ ఇయర్ జోష్ కనిపిస్తోంది. మహమ్మారి ఎండ్ కార్డ్ పడాలని మనసు నిండా కోరికతో కొత్త సంవత్సరాన్ని ఆహ్వానిస్తున్నారు జనాలు. ఇక అటు నగరంలో బేకరీలు, వైన్స్ కిటకిటలాడుతున్నాయ్. అటు సామూహిక, బహిరంగ వేడుకలపై పోలీసుల నిషేధం విధించారు. బార్లు, రెస్టారెంట్లు, పబ్బులకు అర్ధరాత్రి ఒంటిగంట వరకు అనుమతి ఇచ్చారు.

డ్రంక్ అండ్ డ్రైవ్‌పై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. మత్తులో వాహనం నడుపుతూ దొరికారో కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. ఇక అటు నగరంలో ఫ్లైఓవర్లతో పాటు ఔటర్ రింగ్ రోడ్లను రాత్రి 11గంటల నుంచి క్లోజ్ చేయనున్నారు. కరోనా నిబంధనల మధ్యే నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని సూచిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories