Telangana: ఆస్పత్రిలో బెడ్ కన్ఫర్మేషన్ ఉంటే అనుమతి

No Confirmed Bed no Entry Telangana
x

Telangana:(File Image)

Highlights

Telangana: ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణలోకి వచ్చే కరోనా రోగులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేసింది.

Telangana: దేశంలో ఎక్కడైనా కరోనా వైద్యం తీసుకోవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే తెలంగాణలో దీనికి విరుద్దంగా కొన్ని మార్గదర్శకలను ప్రభుత్వం జారీ చేసింది. పూర్తి వివరాల్లోకి వెళితే.... ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణలోకి వచ్చే కరోనా రోగులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేసింది. అలా వచ్చే కరోనా పేషెంట్లు ముందుగానే ఆస్పత్రిలో బెడ్ కన్ఫర్మేషన్ తప్పనిసరి చేసుకోవాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

కోవిడ్ పేషెంట్ల అడ్మిషన్ కోసం ముందే ఆస్పత్రి అనుమతి అవసరమని పేర్కొంది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవాళ్లకు ప్రత్యేక కాల్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించింది. ఇందుకోసం కాల్ సెంటర్ ఫోన్ నంబర్లు 040 2465119, 949443851 పని చేస్తాయని తెలిపింది.

అంబులెన్స్ లేదా వాహనాలకు ముందస్తు అనుమతి తప్పనిసరి అని స్పష్టం చేసింది. ఆస్పత్రులతో టై అప్ లేకుండా పేషెంట్లకు విలువైన సమయం వృధా అవుతుందని.. ఒక ఆస్పత్రి నుంచి మరో ఆస్పత్రికి తిరగడం వల్ల కూడా కరోనా వ్యాప్తి చెందుతుందని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది.

ఎపిడమిక్ యాక్ట్ ద్వారా గైడ్ లైన్స్ విడుదల చేశామని పేర్కొంది. ప్రభుత్వ కంట్రోల్ రూమ్‌కు ఆస్పత్రులు దరఖాస్తు చేసుకోవాలని.. ఇందుకోసం పేషెంట్లకు సంబంధించిన వివరాలన్నీ ఇవ్వాలని స్పష్టం చేసింది. కంట్రోల్ రూమ్ నుంచే పేషెంట్లకు పాస్‌లు మంజూరు ఉంటుందని..కోవిడ్ కంట్రోల్ రూమ్ పాస్‌తో పాటు ఈ పాస్ తప్పనిసరి అని వెల్లడించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories