నిజామాబాద్‌ శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు పోటెత్తిన వరద

Nizamabad Sriramsagar project flooded
x

నిజామాబాద్‌ శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు పోటెత్తిన వరద

Highlights

Nizamabad: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ ఇన్‌ఫ్లో 3లక్షల 10వేల క్యూసెక్కులు

Nizamabad: తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న వానలకు ప్రాజెక్ట్‌లన్నీ జలకళను సంతరించుకున్నాయి. ప్రాజెక్ట్‌ల్లోకి భారీగా వరదనీరు చేరుతోంది. చెరువులు, కుంటలు, ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. చెరువులు, వాగులు అలుగు పోస్తున్నాయి. భూపాలపల్లిలోని కాళేశ్వరం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతుంది. కాళేశ్వరం దగ్గర 8.89 మీ.ల ఎత్తులో గోదావరి ప్రవహిస్తోంది. లక్ష్మీ బ్యారేజ్‌లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. 4లక్షల 93వేల 5వందల40 క్యూసెక్కులు ఇన్‌ఫ్లో ఉంది. ఔట్‌ఫ్లో 5లక్షల 54వేల 6వందల 60 క్యూసెక్కులు.

ఇక అదే జిల్లాలోని మరో ప్రాజెక్ట్‌ సరస్వతి బ్యారేజ్‌లోకి కూడా భారీగా వరద నీరు వస్తోంది. 50 గేట్లను ఎత్తి నీటిని దిగువకు రిలీజ్ చేస్తున్నారు. ములుగు జిల్లా వెంకటాపురం, వాజేడు మండలాల్లో భారీ వర్షం పడుతుంది. దీంతో బొగత జలపాతం ఉగ్రరూపం దాల్చింది. అటు పాలెం వాగు ప్రాజెక్టు కూడా వరద నీరు వస్తుండడంతో 4 గేట్లను 4 అడుగుల మేర ఎత్తివేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తుంది.

జిల్లాలోని అన్ని ప్రాజెక్టులకు వరద నీరు వచ్చి చేరుతుంది. ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో నిండడంతో గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజ్ కి భారీగా గోదావరి వరద వస్తుంది. 175 గేట్లను పైకి ఎత్తారు. 2లక్షల 21వేల క్యూసెక్కుల వరద జలాలు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. బ్యారేజ్ నీటిమట్టం 13.63 అడుగులకు చేరుకుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories