Telangana: తమిళనాడులో పసుపు బోర్డు అంశం ఆ రాష్ట్రానిదే- ఎంపీ అర్వింద్

Nizamabad MP Dharmapuri Arvind About Tamil Nadu Turmeric Board
x

Telangana: తమిళనాడులో పసుపు బోర్డు అంశం ఆ రాష్ట్రానిదే- ఎంపీ అర్వింద్

Highlights

Telangana: తమిళనాడు మ్యానిఫెస్టోలో పెట్టిన పసుపు బోర్డు అంశం ఆ రాష్ట్రానికి సంబంధించిందేనని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు.

Telangana: తమిళనాడు మ్యానిఫెస్టోలో పెట్టిన పసుపు బోర్డు అంశం ఆ రాష్ట్రానికి సంబంధించిందేనని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. జాతీయ స్థాయిలో పసుపు బోర్డు ఇస్తే అది ఖచ్చితంగా తెలంగాణకే వస్తుందని ప్రకటించారు. తెలంగాణ ప్రజలు చాలా తెలివైన వారని వారు కేసీఆర్‌ను ఎప్పుడు గద్దె దించాలో తెలంగాణ ప్రజలకు తెలుసన్నారు.

రీజనల్ స్పైసెస్ పార్క్ ద్వారా పసుపు రైతులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని దిగుబడులు నిలిపేయడంతో పసుపుకి ధర కూడా పెరిగిందన్నారు. జిల్లాలో బోర్డు కన్నా మంచి వ్యవస్థ పని చేస్తోందని కేరళలో ఎన్నారై బోర్డు పెట్టినట్లు, పసుపు కోసం తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం ఏదయినా ఉపాయం చేస్తే తప్పులేదు కదా? అన్నారు. స్పైస్ బోర్డు లేఖ రాసి చాలా రోజులైనా కేసీఆర్ ప్రభుత్వం ఇంకా స్పందించడం లేదన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories