KCR News: జలవివాదంలో కేసీఆర్ సర్కార్‌కు షాక్

NGT Orders committee to Examine Violations in Palamuru Ranga Reddy Lift Irrigation Scheme
x

జలవివాదంలో కేసీఆర్ సర్కార్‌కు షాక్ 

Highlights

National Green Tribunal: తెలుగు రాష్ర్టాల మధ్య కొనసాగుతున్న జలవివాదం రోజుకో ములుపు తిరుగుతుంది.

National Green Tribunal: తెలుగు రాష్ర్టాల మధ్య కొనసాగుతున్న జలవివాదం రోజుకో ములుపు తిరుగుతుంది. తాజాగా తెలంగాణ సర్కార్ కి షాక్ ఇచ్చింది నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో పర్యావరణ ఉల్లంఘనలపై తెలంగాణ ప్రభుత్వానికి ఎన్జీటీ నోటీసులు జారీ చేసింది. పర్యావరణ ఉల్లంఘనలు జరిగాయో లేదో తేల్చేందుకు నిపుణుల కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. వాస్తవ పరిస్థితిని తనిఖీ చేసి ఆగస్ట్‌ 27లోగా నివేదిక ఇవ్వాలని ఎన్జీటీ ఆదేశాలు జారీ చేసింది.

ఏపీ-తెలంగాణ రాష్ట్రాల మధ్య జలవివాదం కేసీఆర్ సర్కార్ కు షాక్ తగిలింది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో పర్యావరణ ఉల్లంఘనలపై ఎన్జీటీ సీరియస్ అయ్యింది. ప్రాజెక్ట్ నిర్మాణంలో పర్యావరణ అనుమతులు పాటించడంలేదని దాఖలైన పిటిషన్ ను ఎన్జీటీ స్వీకరించింది. కేంద్ర పర్యావరణ శాఖ, తెలంగాణ సాగునీటి శాఖ, మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ఎస్ఈ, గనుల శాఖ, మహబూబ్ నగర్ జిల్లా అసిస్టెంట్ డైరెక్టర్లకు నోటీసులు జారీ చేసింది. పర్యావరణ అనుమతుల ఉల్లంఘన జరిగాయేలేదో తేల్చేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది ఎన్జీటీ. పర్యావరణ ఉల్లంఘనల పై వాస్తవ పరిస్థితిని తనిఖీలు జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది ఎన్జీటీ. ఇక ఈ కేసు తదుపరి విచారణను వచ్చే నెల 27 వ తేదీకి వాయిదా వేసింది.

గతంలోనే రాయలసీమ ఎత్తిపోతల పథకంపై తెలంగాణ ప్రభుత్వం ఎన్జీటీని ఆశ్రయించింది. ఎన్జీటీ ఆదేశాలకు విరుద్దంగా ఏపీ సర్కార్ పనులు చేపడుతుందని ఫిర్యాదు చేసింది. కేఆర్ఎంబీ, పర్యావరణ, అటవీ అధికారులు రాయలసీమ ప్రాజెక్టులు సందర్శించాలంటూ ఎన్జీటీ ఆదేశాలు జారీ చేసింది. అయితే ఏపీ ప్రభుత్వం ఎన్టీటీ అధికారులను అడ్డుకుంటుందని తెలంగాణ సర్కార్ ఆరోపిస్తుంది. ఎన్టీటీ బృందం రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని సందర్శించాలని విజ్ఞప్తి చేసింది. ఇందుకు అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పిస్తామంటుంది. అంతే కాదు రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు ఇవ్వొద్దని విజ్ఞప్తి చేస్తూ కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖకు ఇప్పటికే లేఖ రాసింది తెలంగాణ ప్రభుత్వం.

ఇది ఇలా ఉండగా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర షెకావత్‌తో భేటీ అయి కృష్ణా జలాల వివాదం అంశంపై చర్చించారు. తెలంగాణ ప్రభుత్వం చట్టవ్యతిరేకంగా వ్యవహరిస్తోందని, రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌కు అనుమతి ఇవ్వాలని కోరామని తెలిపారు. కేఆర్‌ఎంబీ పరిధిని నోటిఫై చేయాలని విజ్ఞప్తి చేసినట్లు విజయసాయిరెడ్డి చెప్పారు. కృష్ణా జలాల వాటాల నిష్పత్తిపై ప్రస్తుత నీటి సంవత్సరానికి సంబంధించి పునః సమీక్షించాలని తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఎన్జీటీ నోటీసులపై ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.


Show Full Article
Print Article
Next Story
More Stories