CS Shanti Kumari: మరో 48గంటలు వర్షాలు.. ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు సిద్ధం

Next 48 Hours Has Heavy Rains In Telangana
x

CS Shanti Kumari: మరో 48గంటలు వర్షాలు.. ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు సిద్ధం

Highlights

Telangana Rains: నీటిపారుదల శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలన్న సీఎస్‌

Telangana Rains: తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారులతో సమీక్ష నిర్వహించారు. రానున్న 48గంటల్లో కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆమె తెలిపారు. అన్నిశాఖ అధికారులతో పాటు జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. అత్యవసర పరిస్థితుల్లో సహాయం కోసం ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలను సిద్ధంగా ఉంచినట్లు చెప్పారు.

వరంగల్‌, ములుగు, కొత్తగూడెంలో ఎన్‌డీఆర్‌ఎప్‌ బృందాలు సిద్ధంగా ఉన్నాయని, ఈ సందర్భంగా అధికారులు సీఎస్‌ శాంతికుమారికి చెప్పారు. హైదరాబాద్‌లోనూ 40 మంది సిబ్బందితో బృందం సిద్ధంగా ఉందన్నారు. గేట్రర్‌ 426 హైదరాబాద్‌లో మాన్‌సూర్‌ ఎమర్జెన్సీ బృందాలు సిద్ధంగా ఉన్నాయని.. అలాగే 157 స్టాటిక్‌ టీమ్‌లను సిద్ధంగా ఉంచినట్లు పేర్కొన్నారు. నీటి నిల్వ ఉండే 339 ప్రాంతాల వద్ద ప్రత్యేక సిబ్బందిని మోహరించామని, ఇప్పటి వరకు చెరువులు, కుంటలకు ఎలాంటి హాని జరుగలేదని అధికారులు తెలిపారు. సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని, అన్ని మంచినీటి ట్యాంకుల్లో క్లోరినేషన్‌ చేపట్టాలని సీఎస్‌ శాంతికుమారి అధికారులను ఆదేశించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories